ఒక అక్షరం పుట్టడం వెనక ఎంత తపన, ఇష్టం దాగి ఉంటాయో ఒక్క రచయితకి ✍మాత్రమే తెలుస్తుంది.. చేతిలో పెన్ను, పెన్ను కింద పేపర్ మాత్రమే ఉంటే సరిపోదు. మనసులో ఆ అక్షరంపై బోలెడంత ప్రేమ 💓ఉండాలి.. ఆ అక్షరం దాని పక్కనే మరో అక్షరాన్ని పుట్టించగలిగే అవసరం ఏర్పడాలి.. అలా ఏర్పడిన అక్షరాల కూర్పుకు పాఠకుడిని మెప్పించేంత స్థోమత ఉండాలి.. అప్పుడే మనసు పెట్టి రాసిన అక్షరం పది మందికి నచ్చి, వాళ్ల మనసులను గెలిచి నీకు ఓ గౌరవం తెచ్చి పెడుతుంది.. సంతృప్తి కలిగిస్తుంది. అలాంటి గౌరవం, సంతృప్తి నేను ఈ అక్షర ప్రయాణంలో చాలా సార్లే పొందాను. దానికి కారణం మాత్రం ఖచ్చితంగా మీరే.. అవును.. ఈ మాట చదవగానే ముఖంలో చిరునవ్వుతో 😄నన్ను తలుచుకున్నారు చూశారా.. అదే నాకు మీరు ఇచ్చిన బోలెడంత ప్రేమ..🙇♂️
అవునండీ.. అక్షరం పుట్టింది నా నుంచే అయినా.. బాగుందని మెచ్చుకుని దానికి ఓ స్థాయిని కల్పించింది మాత్రం ఖచ్చితంగా మీరే. చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో డైరీ 📙రాసుకునే దగ్గరి నుంచి.. ఆ తర్వాత రోజుల్లో ఏదో ఉన్న కొద్ది జ్ఞానంతో చిన్న చిన్న ఆర్టికల్స్, బ్లాగ్.. ఇలా ఈ ప్రయాణం ఒక పుస్తకం📖 రచించే వరకూ చేరిందంటే అదంతా మీ ఆదరణ వల్లే. ఒక పుస్తకం రాస్తానని గానీ, దానిపై నా పేరును చూసుకుంటానని గానీ, చూసుకోవాలని గానీ నేను ఏనాడూ కల గనలేదు. కానీ, అది ఈ రోజు ప్రత్యక్షంగా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇచ్చిన ప్రోత్సాహమే.. మీరు చూపించిన ప్రేమే..😍
ఏం చేశానని.. ఇంకా ఏం సాధించానని..? నాకు చిన్నప్పటి నుంచి రాయడంపై ఉన్న ఇష్టాన్ని పది మందితో పంచుకున్నా. ఒకసారి రాసింది నచ్చకపోతే నన్ను నేనే ప్రశ్నించుకుని.. నాతో నేనే చర్చించుకుని అది ఇంకా ఎంత బాగా రాస్తే మిమ్మల్ని మెప్పిస్తుందోనని తపన పడ్డా. నా మనసులో పుట్టిన పాపాయిలాంటి అక్షరం బుడిబుడి అడుగులు వేసుకుంటూ.. బుజ్జిబుజ్జిగా మిమ్మల్ని పలకరిస్తూ ఊసులు చెబుతుంటే.. తిరుమల 🛕ప్రయాణంలో నాతో పాటు నడిచారు.. అమ్మ 👩🍼 ప్రేమకు ఒడిలో బజ్జున్నారు.. వెనుకబడిన నాన్న 👨🦳విలువ తెలుసుకున్నారు.. ఆడపిల్ల 👧 అపురూపమంటే ఒప్పుకున్నారు.. దేవుడి దర్శనం చేయిస్తే చెయ్యెత్తి మొక్కారు.. సినిమాను 🎥 వివరిస్తే మళ్లీ చూసినట్లుందని ప్రేక్షకుడిలా ఆనందించారు.. ఒక్కటేమిటి.. మీతో మీరే నవ్వుకున్నారు.. మీలో మీరే బాధ పడ్డారు.. మీలోని పాఠకుడిని తట్టిలేపారు.
దాదాపు గత మూడేళ్లుగా కొనసాగుతున్న నా ఆర్టికల్స్.. బ్లాగ్ ప్రస్థానం అంతటితో అక్కడే ఆగిపోకుండా పుస్తకం రాసుకునే వరకూ చేరుకుంది.. అది కూడా సినీ ప్రపంచం గర్వించదగిన దర్శక మహానుభావులు కళాతపస్వి కే. విశ్వనాథ్ 🙏గారి సినిమాల గొప్పతనాన్ని నా మాటల్లో చెప్పే ప్రయత్నం వరకూ నన్ను నడిపించింది.. ఆ మహానుభావుడి ఫోటో పక్కనే నా పేరును వేసుకునేంత హోదాను కల్పించింది.. ఇది చాలదా నా జీవితానికి.. ఇంత ప్రేమ చాలదా నేను చేసిన చిన్ని ప్రయత్నానికి. ఈ ఆదరణ ఎప్పటికీ మర్చిపోను.. మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ గుండెల్లోనే 🫀దాచుకుంటానని మాట ఇస్తూ.. ఇన్ని రోజులుగా నా ప్రతి ఆర్టికల్‌కు మీ నుంచి వచ్చిన విలువైన స్పందనలను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.. మీరు ఎంతో ఇష్టంగా నాకు చేసిన కామెంట్లు మీరు మర్చిపోయినా, నేను మాత్రం గుర్తు పెట్టుకుని మరీ ఇలా అన్నీ దాచుకున్నాను.. అందులో మీ కామెంట్ కూడా అందంగా కనిపిస్తుంది.. చూడండి.. ఇలాగే మీ ప్రేమను కొనసాగించండి...💗🙏


















కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి