Nanna is my hero.. 💖


Nanna is my hero.. 💖
మనల్ని ఎప్పుడు వెంటాడే ఓ ఎమోషన్ అని ఏదో సినిమాలో చెప్పినట్లు.. నాన్న మన జీవితానికి మొదటి హీరో. అందరూ నవమాసాలు మోసి కని, పెంచిన అమ్మ గురించే ఎక్కువగా మాట్లాడతారు. కానీ, పిల్లలకు పాల డబ్బాల నుంచి పెళ్లి పందిరి వరకు తీసుకువెళ్లే నాన్న గురించి ఎవరూ మాట్లాడరు. నీ పుట్టుకకి కారణమైన దగ్గర నుంచి.. నువ్వు రేపు సమాజంలో గర్వంగా తల ఎత్తుకుని నిలబడేలా నీకు ఏ మాత్రం సంబంధం లేని ఒక క్రేజ్ తెచ్చిపెట్టేది ఆ నాన్నే. బయట ఎవరయినా అడిగితే.. ఫలానా వాళ్ల అబ్బాయి అనో, అమ్మాయి అనో చెప్పుకోవాలన్నా కూడా ఆయన క్రెడిట్ మనకు కావాల్సిందే.
Nanna is my hero.. 💖
నిన్ను కన్నాక మొదటిసారి తన చేతుల్లోకి జాగ్రత్తగా తీసుకున్న నాన్న ఆనందం, నువ్వు బుడిబుడి అడుగులు వేసినప్పుడు నీ చిట్టి వేలును పట్టుకుని నడిపించిన నాన్న తోడు, నువ్వు అల్లరి చేస్తే బెదిరించి రెండు మాటలు తిట్టిన నాన్న కోపం, నువ్వు ఏదైనా కావాలని పట్టుబట్టి మారాం చేస్తూ సతాయించినప్పుడు వచ్చిన నాన్న ఆవేశం, నువ్వు చదువులో, సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు వచ్చిన నాన్న గర్వం, నువ్వు ఇంకో బిడ్డను కన్నాక కూడా నిన్ను ఇంకా పసిపాపలాగే చూసే నాన్న గారాబం, తనకు చేతకాని వయసులో నీ భుజాన్ని ఆసరా చేసుకుని వేసే నాన్న అడుగులు.. ఇలా 'నాన్న' అనే ఒక సంపూర్ణ రూపం మన జీవితంలో ఎంతో అపురూపం.Nanna is my hero.. 💖
నాన్న.. నీ కుటుంబాన్ని భుజాలపై నడిపే ఒక బాధ్యత గల వ్యక్తి. అలా నీ చిన్నప్పటి నుండి నీ కళ్ల ముందే ఉండి, ఎలా ఉండాలో, ఎలా బతకాలో చూపించి.. నేర్పించి నీకు అనఫీషియల్ టీచర్ అవుతాడు ఆ నాన్న. కొడుకు విషయంలో తండ్రిగా, గైడ్‌గా, ఫ్రెండ్‌గా ఉంటూ.. ఇటు కూతురి విషయంలో అన్నీ తానే అయ్యి, బయట పెద్దరికంగా ఉండి.. పెళ్లి చేసి పంపేటప్పుడు మాత్రం కళ్లలో నీళ్లు పెట్టుకునే పిచ్చి మారాజు నాన్న అంటే. అలాంటి నాన్నకు మనం ఏం ఇద్దాం?
Nanna is my hero.. 💖
కళ్ల ముందు ఉన్నప్పుడు కాపాడుకుందాం.. నిన్ను పెంచి పెద్ద చేసినట్లే.. ఆయనకి చేతకాని వయసులో అండగా ఉండి బాగా చూసుకుంటూ నాన్నకే మళ్లీ మరో నాన్న అవుదాం. మనం ఆయనకి జన్మని ఇవ్వలేకపోవచ్చు.. కానీ జన్మంతా ఆయన ఆనందపడేలా, గర్వపడేలా నడుచుకుందాం. నువ్వే నా హీరో...

I LOVE YOU NANNA 💖

మీ జీవితంలో మీ నాన్న అంటే మీకు ఎంత ఇష్టం.. కామెంట్ ద్వారా నాతో పంచుకోండి. మీ నాన్నకి ఈ ఆర్టికల్ షేర్ చేయండి.

Thank you 


Nanna is my hero.. 💖



కామెంట్‌లు

  1. Nanna ki em idham? Em ichina thakkuve, yentha viluvaina vasthuvu ichina thakkuve!
    Aina kooda mikkili viluva, nanna ni kondantha santhoshimpachesthundhi, adhey manam vadiki iche GAURAVAM mariyu VILUVA 🥹.
    Let’s all take care of our Dads & moms on days when they can’t make it to themselves 🙌.
    Like our friend RAKESH mentioned 🥺.
    All kudos tho the fathers out there who dedicated themselves to their families 🫂

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది అన్నా..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి