ఏ రిలేషన్లో అయినా ఇద్దరూ ఒకేలా ప్రేమను చూపలేరు.. ఏ ఇద్దరు ఒక బంధంలో మునిగి ఉన్నప్పటికీ అందులో ఒకరికి మాత్రమే ఎక్కువ ప్రేమ ఉంటుందనేది నిజం. ఆ ఒక్కరే నిజాయితీగా ఉంటారు.. ఆ ఒక్కరే ఎన్ని గొడవలు వచ్చినా అర్థం చేసుకుంటారు.. ఆ ఒక్కరే ఎదుటి మనిషి తప్పులను కూడా క్షమిస్తారు.. ఆ ఒక్కరే తమ బంధం ఎక్కడ దూరం అవుతుందో అని ఆరాటపడతారు.. ఆ ఒక్కరే ఇష్టపడిన మనిషి కోసం పాకులాడుతారు.. ఏది ఏమైనా కలిసి ఉందామని ఆ ఒక్కరు మాత్రమే అనుకుంటారు. ఆ ఒక్కడిగా ఆలోచించి ఈ కంటెంట్ చదువు...నువ్వు ఇది చేయొద్దు.. అది చేయొద్దు.. నాకు ఇష్టం లేదు.. ఇలా ఉండు, అలా ఉండు అంటే ప్రేమించిన మనిషికి ఎందుకు అది తప్పుగా అర్థమవుతుంది..? ఏదో వాళ్ల స్వాతంత్య్రాన్ని కోల్పోయినట్లుగా ఎందుకు ఫీల్ అవుతారు..? ఎందుకు అందులో తమ మీద చూపించే ప్రేమను గుర్తించరు..? ఒప్పుకుంటా.. ఎంత ఇష్టం ఉన్నా ప్రతి మనిషికి ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. అది దాటి వస్తే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. కానీ, అక్కడ మీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నవాళ్లు అలా చెప్తున్నారు అంటే ఒక్కసారి ఆగి ఆలోచిస్తే బాగుంటుంది. అలా కాదు.. నీకు ఫ్రీడమ్ కావాలా? అది ఎల్లకాలం ఉండదు. నాకు తెలిసినవరకు.. చేయడానికి ఒక పని.. బ్రతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు.. ఆ జీవితం సంతోషంగా ఉంటుంది.ఒక మనిషి కళ్లు గప్పి ఏమైనా చేయొచ్చు.. ఎన్ని తప్పులు అయినా చేయొచ్చు. ఒకరితో ప్రేమలో ఉన్నామని చెప్తూ బయట ఎన్నైనా నడిపించొచ్చు. ఏం జరగనట్లు నటించొచ్చు. దానికి పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. కానీ అలా చేసే ముందు మీరు అసలు ప్రేమించట్లేదు అనే విషయాన్ని ఒప్పుకోండి. ఎందుకంటే.. ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే అలా బయట దారులు తొక్కాలని అసలు అనిపించదు.. అనిపించినా ఆ సమయంలో మీ మీద ప్రాణాలు పెట్టుకున్న మనిషి ఖచ్చితంగా గుర్తు వస్తారు. అలా గుర్తు వస్తే మీరు ఆ తప్పు చేయలేరు. అయినా సరే చేశారు అంటే.. మీకు ప్రేమ అనే విషయంలో పూర్తి విశ్వాసం లేదు అన్నమాట. మరి అదే స్వేచ్ఛ ఎదుటివాళ్లు కూడా తీసుకోవచ్చు కదా! మీకు ఉన్నట్లే మిమ్మల్ని ప్రేమించేవాళ్లకు కూడా అవకాశం ఉంటుంది కదా! మరి ఎందుకు వాళ్లు మీ గురించే ఆలోచిస్తూ ఆ గీత దాటట్లేదు..? ఎందుకంటే.. వాళ్లకు ఆ సుఖాల కన్నా మీ మీద ఉన్న పిచ్చి ప్రేమ గొప్పది.గొడవలు వస్తాయి.. అరుచుకుంటాం.. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటాం.. కానీ ఏది ఏమైనా తిరిగి కలిసిపోవాలి. అప్పుడే ప్రేమించినవాళ్లను మీరు పూర్తిగా నమ్మినట్లు. చిన్న చిన్న అలకలు, గొడవలకే నా వల్ల కాదు బాబు ఇక అని అనిపిస్తే ఖచ్చితంగా తప్పుకోండి. ఎందుకంటే.. మీకు ఒక మనిషిని భరించే మనస్తత్వం, భరించేంత ప్రేమ లేవు అన్నట్లే. ప్రాణాలు పెట్టుకున్న వాళ్ల కళ్లల్లో మీ కోసం పెంచుకున్న ప్రేమ కన్నా.. చిన్న చిన్న తప్పులే కారణంగా చూపించారంటే మీకు అర్థం చేసుకునే గుణం కూడా లేనట్లే. ఈ రోజు మీరు ఒకరికి కట్టుబడిపోయామని.. నాకేంటి ఈ గోల, ఒకప్పుడు ఎంత బాగుండేది నా లైఫ్ అని అనిపించొచ్చు. కానీ రేపటి రోజు మీకు అవసరం పడినా ఆ మనిషి తిరిగి రాకపోవచ్చు. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం చాలా గొప్ప విషయం. అలా ప్రేమించేవాళ్లను దేవుడు మీకు ఊరికే ఇవ్వడు, దానికి ఎంతో అదృష్టం కావాలి. ఆ అదృష్టాన్ని నువ్వు తెలిసి కూడా ఈ రోజు కాళ్ల దన్నుతున్నావు.. చూసుకో మరి.. ఆలోచించుకో..!ఒక మనిషితో భరించలేక మీరు దూరంగా ఉండాలి అనుకోవచ్చు.. అది పూర్తిగా మీ అభిప్రాయం.. దాన్ని కాదు అనే హక్కు ఎవరికీ లేదు. మీకు మీరు ఒంటరిగా ఉండి ముందుకు వెళ్లేంత మెచ్యూరిటీ ఉండొచ్చు. కానీ, ఎదుటివాళ్లు.. అదేనండీ మిమల్ని ప్రేమించినవాళ్లకు ఆ శక్తి ఉండకపోవచ్చు. అందుకే నిర్ణయం తీసుకునే ముందు మరొక్కసారి ఆలోచించండి. ప్రతి విషయంలో మీరు ఉన్నారని.. వాళ్లకేం కాదని పెంచుకున్న ఆశలను నాశనం చేయకండి. ఎందుకంటే.. వాళ్లు వెళ్లిపోవాలి అనుకుంటే మీరు చెప్పేవరకు ఎందుకు..? ఎప్పుడో వెళ్లిపోయేవాళ్లు కదా. వాళ్లు మీకు ఆ విలువ ఇచ్చారు కాబట్టే ఇన్ని రోజులు మీతో ఉన్నారు.. ఎప్పటికీ మీరే కావాలని ఎదురు చూస్తున్నారు.. గతంలో మీరు చేసిన తప్పులను కూడా క్షమించేశారు.. అందుకే అంత ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు.. వద్దు నాకేంటి అని ఒక్కసారి వాళ్లు గట్టిగా అనుకుంటే అసలు మీరు వాళ్ల లెక్కలో కూడా ఉండరు, సరిగ్గా చెప్పాలంటే వాళ్ల ప్రేమ ముందు మీరు చిన్న చీమతో సమానం.మనుషులు దూరంగా ఉంటే ఆ ఇష్టం అనేది స్వచ్ఛంగా ఉంటుంది. దూరంగా ఉన్నవాళ్లతో మీరు ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు.. పోనీ కాల్, మెసేజ్ లాంటివి చేసినప్పుడు అటు వైపు నుంచి అంతే ఇష్టంగా రెస్పాన్స్ వస్తే మీరు నిజంగా లక్కీ. అలా కాదని, ఒక్క మెసేజ్ రిప్లై ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటున్నారు.. మిమ్మల్ని ఎదురుచూసేలా చేశారు అంటే మీరే అర్థం చేసుకోవడం మంచిది. ఎందుకంటే.. నిజంగా ప్రేమించిన మనిషి ఎప్పుడూ మిమ్మల్ని ఎదురుచూసే పరిస్థితిలో పెట్టరు.. ఒక్క పని ఒత్తిడి, హడావిడిలో ఉన్నప్పుడు తప్ప. ఏ మనిషి కూడా నిజానికి పూర్తిగా బిజీగా ఉండరు.. అది వాళ్లు మనకు ఇచ్చే ప్రియారిటీ అంతే.నాతో మాట్లాడు.. నాతో ఉండు.. నన్ను పట్టించుకో అని ఎప్పుడూ ఎవరినీ అడుక్కోకండి. ఆ మనిషి మీకు కావాలి అని మీలో ఎంత బలమైన కోరిక ఉన్నా.. అడుక్కుంటే దొరికేది కాదు ప్రేమ అంటే. ఆ మనిషికి నిజంగా మీరు కావాలి అనిపించాలి. అలా అనిపించినప్పుడు మీరు అడగకపోయినా ఉంటారు.. మీ గురించే ఆలోచిస్తారు.. మిమ్మల్ని ప్రేమిస్తారు. అడుక్కునే వరకూ తెచ్చారు అంటే.. ఆ మనిషి మీకు కరెక్ట్ కాదు అని. ఆ మనిషికి మీలాగా నిజాయితీగా ప్రేమించేవాళ్లను పొందే అర్హత లేదని. ఆ విషయం వాళ్లకు నిజంగా అర్థమైతే మీరు అడుక్కునేవరకు తీసుకురారు పరిస్థితిని.ఎవరైనా మీ లైఫ్ నుంచి వెళ్లిపోయారు.. మిమ్మల్ని ఏడిపించారు అని ఎప్పుడూ బాధ పడకండి. వాళ్లు అలా వెళ్లిపోవడమే కరెక్ట్ ఏమో. వాళ్లు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఉండేవాళ్లు. ఒకవేళ మీరే వెళ్లిపో అన్నా సరే వెళ్లలేరు కూడా. అలా కాదని వెళ్లిపోయారా.. అది మీ మంచికే. మీకు అంతకు మించిన మంచి లైఫ్ ముందర ఉందని. అందుకే ఏదో జరిగిపోయిందని బాధ పడకుండా.. వచ్చిన పరిస్థితులకు తట్టుకుని నిలబడండి. మిమ్మల్ని కాదని వెళ్లినవాళ్ల గురించే ఆలోచిస్తూ ఉండకుండా.. పీడ విరగడ అయింది అనుకోండి. బాధ ఉంటుంది ఒప్పుకుంటా.. కానీ, కాస్త ఓపిక పడితే మీ లైఫ్ ముందు ముందు మరింత అందంగా ఉంటుంది.సో.. ఫ్రెండ్స్.. ఇలాంటివి మీలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడో ఒకసారి, ఏదోలాగా చూసే ఉంటారు. నాకు తెలిసినవి... అనిపించినవి.. అనుభవించినవి కొన్ని ఇక్కడ రాశాను. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుండా ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇవి చదివాక నాకు కూడా ఇలాగే అనిపించింది నిజమే అనిపిస్తే.. మీరు నిజంగా నిజాయితీ ఉన్నవాళ్లు.. మంచి మనసు ఉన్నవాళ్లు.. నిజమైన ప్రేమ ఉన్నవాళ్లు. మీ దగ్గర ప్రపంచాన్నే శాసించే గొప్ప ప్రేమ ఉంది. సో.. ఏదో అయిపోయిందని బాధ పడకుండా ప్రతి క్షణాన్ని సంతోషంగా స్వీకరించండి.. మీకు నచ్చినట్లు మీ లైఫ్ మారుతుంది. అది మంచైనా.. చెడైనా.. ఏదైనా.. మన మంచికే.
Anna chalaaa ante chalaaa bagundi ra chalaaa connect ayya super ga cheppav anna
రిప్లయితొలగించండిThank you so much..
తొలగించండిజ్ఞాపకాలు చెడ్డవైనా మంచివి ఐన మనసు లో నే కదా ఉంటాయి....
రిప్లయితొలగించండిఅలా అనుకుని, అర్థం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్లడమే..
తొలగించండిసంతోషంగా ఉండడమే...
👌🏻👌🏻👌🏻
రిప్లయితొలగించండిThank you so much..
తొలగించండి