పెళ్లి అనేది నూరేళ్ల పంట అంటారు.. అదే పెళ్లి అయిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పే మాట 'పెళ్లంటే నూరేళ్ల మంట' అని. పెళ్లి కాక ముందు ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తారు.. కానీ, అయ్యాక చాలా మంది ఎందుకు చేసుకున్నామా అని తల బాదుకుంటారు.. పెళ్లి, సంసారం, బాధ్యతలు.. ఇవన్నీ జీవితంలో అందరూ అనుభవించాల్సినవే, సర్దుకుపోవాలి తప్పదు అంటారు.. అంత ఇబ్బంది పడుతూ మరి సర్దుకుపోవడం దేనికి? మనకు ఏ పని అయినా నచ్చే చేయాలి కదా. అందుకే పెళ్లి విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.. కాస్త మీరైనా సొల్యూషన్ చెప్పండి ప్లీజ్..!పెళ్లి చూపులు దగ్గర నుంచి మొదలుపెడదాం. ఈ మధ్య ఈ కార్యక్రమం ఎలా ఉంటుందంటే.. ముందుగా తెలిసిన సంబంధాలు వెతుక్కుంటారు. అందులో మనకు సరిపోయే వాటికి.. అంటే మన చదువు, అంతస్తుకు సరితూగే వాళ్లను సెలెక్ట్ చేసుకుంటారు. ఫోటో, బయోడేటా మిగతా వివరాలు అన్నీ పంపించేస్తారు. అంతా నచ్చితే ఆ తర్వాతే డైరెక్ట్ మీట్. అదే పెళ్లి చూపులు సీన్.. సినిమాల్లో లాగా కాకపోవచ్చు గానీ, కొంచెం అటు ఇటుగా అంతే. అక్కడ ఎదురెదురుగా ఒకరికొకరం చూసుకున్నాక అన్ని రకాలుగా సరిపోతాము అనుకుంటేనే సరే అని చెప్తాం. కొన్నిసార్లు ఆలోచించుకుంటాం కూడా. లేదా ఇంకో రోజు.. ఇంకో పెళ్లి చూపులు. అసలు ఆ ఒక్క 10 నిమిషాల్లో చూసే చూపుల్లో జీవితానికి సరిపడా వాళ్ల గురించి ఏం తెలుసుకుంటామని..?
*****
ఈ మధ్య ఎలా అయిపోయింది అంటే.. సంబంధాలు చూసుకునే టైంలో అబ్బాయి గురించి కనుక్కోవడం.. కుటుంబం, ఆస్తి పాస్తులు ఇవన్నీ లెక్కలు చూడడం మంచిదే. ఎందుకంటే ఒక తండ్రి గారాబంగా పెంచుకున్న తన కూతురికి తర్వాత జీవితం కూడా సుఖంగా, సంతోషంగా ఉండేలా చూడాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, పరిస్థితి ఇలా సింపుల్‌గా లేదు. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు..? గవర్నమెంటా..? సాఫ్ట్‌వేరా? గవర్నమెంట్ జాబ్ అయితే బాగుండు.. అమ్మాయి సంతోషంగా ఉంటుందని ఆలోచించే తల్లిదండ్రులు చాలా ఉన్నారు. ఏ.. ప్రైవేట్ జాబ్ చేసేవాళ్లు మంచివాళ్లు కాదా? వాళ్లు మీ అమ్మాయిని సంతోషంగా చూసుకోలేరా? సాఫ్ట్‌వేర్ జాబ్ చేసి నెలకు లక్ష రూపాయలు తెచ్చి మీ కూతురి చేతిలో పెడితే సరిపోతుందా? అదేనా ముఖ్యం..? అబ్బాయి మంచివాడేనా..? మీ కూతురి మొహంలో ఎప్పుడూ నవ్వు ఉండేలా బాగా చూసుకునేవాడు కదా కావాల్సింది..? మరి ఇప్పుడు పరిస్థితి రివర్స్‌లో ఉందేంటి?
*****
దేశానికి వెన్నెముక రైతు అంటారు.. కానీ అదే ఒక అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడు అంటే మాత్రం తక్కువగా చూస్తారు.. పిల్లని మాత్రం ఇవ్వరు. ఇప్పుడంతా కార్పొరేట్ లెవెల్‌లో ఉద్యోగం చేయాలి.. సంపాదించాలి.. హుందాగా ఉండాలని చూసే కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ఒప్పుకుంటారా?.. ఇంకోటి.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఉద్యోగం చేస్తారు. కానీ, అమ్మాయి జీతం కన్నా అబ్బాయి ఎక్కువ సంపాదించాలి.. జీతం ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. మా అమ్మాయికే లక్ష వస్తుంది.. మీ అబ్బాయికి 50 వేలేనా అని మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారండోయ్.. ఏ.. అబ్బాయే ఎక్కువ సంపాదించాలని అనడం ఇదెక్కడి రూల్? ఇంకేముంది సంబంధం క్యాన్సిల్.
*****
పెళ్లికి ముందు అమ్మాయి/అబ్బాయి క్యారెక్టర్ గురించి ఎంక్వయిరీ చేయడం అయితే మరీ ఘోరం. అలా చేయడం తప్పు అని కాదు.. ఎందుకంటే, ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. సోషల్ మీడియా ప్రభావమా?.. సినిమాల ప్రభావమా?.. తెలియదు గానీ ఒకప్పటి లాగా లేదు పరిస్థితి. ముఖ్యంగా మన అమ్మానాన్న కాలంలో లాగా లేరు ఇప్పటి మనుషులు. అన్నీ కుదిరితే నువ్వు ఎంక్వయిరీ చేసిన వ్యక్తితోనే నీకు పెళ్లయితే..? అదే మనిషితో నువ్వు జీవితాంతం కలిసి బతకాలి. కొన్నేళ్లు పోయాక వెనక్కి తిరిగి చూసుకో.. నువ్వు చేసిన పనికి నీకే సిగ్గేస్తుంది. ఇంతేనా పెళ్లి అంటే..? ఇదేనా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అంటే..? ఇలాంటి దాని గురించేనా జన్మజన్మల బంధం అని అందరూ గొప్పగా మాట్లాడుకునేది..? ఏమో.. నాకైతే ఏమీ అర్థం కాదు.
*****
సరే.. ఇదంతా కాదు. అందరి జీవితం ఇలాగే ఉంటుంది, అందరం ఇలాగే సర్దుకుపోవాలి అంటారా..! ఏమో.. పది మందిని చూసి ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం అంటే అందులో నిజం లేదు అనిపిస్తుంది. ఒక మనిషి మన జీవితంలో ఉండాలి అంటే.. ఆ మనిషి లేకుండా మనం బతకలేం అనిపించాలి. అలాంటివి ఈ రోజుల్లో కష్టమే. ఇలా చెప్తే చాలా మందికి నా మాటలు నచ్చకపోవచ్చు. కానీ ఇవే నిజం.. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది.
THANK YOU
Well Said...👌👌
రిప్లయితొలగించండిThanks 🙏
తొలగించండిమిత్రమా నీ వర్ణన బాగున్న ఒప్పుకోవాలి ఉన్న ఒప్పుకోలేనటువంటి సిచువేషన్ లో ఉండడం జరిగింది
రిప్లయితొలగించండి🙏
రిప్లయితొలగించండిమీరు సమాజంలో జరిగేవి చూసి,విని చెప్తున్నారు ఒకసారి అనుభవంతో కూడా చెప్పి చూడు అన్నా....
రిప్లయితొలగించండిఅంటే అనుభవం పాఠాలని ,గుణ పాఠాలని కూడా నేర్పిస్తుంది అంటారు కదా అందుకే అనుభవించి చెప్పు ఒకసారి 🤪😜😛 అప్పుడు నీ ఒపీనియన్ కూడా మారుతుందేమో చూడాలని ఉంది....
అవునన్నా కాదన్నా అనుభవించాల్సిందే నేను కూడా..
తొలగించండినేను పరిస్థితి ఎలా ఉందో మాత్రమే చెప్పాను. వాటికి నేను వ్యతిరేకం కాదు
Baaga cheppav Mitrama, ne e chethi rathalu aksharala satyam, ee Kaalam lo kuda marriage antene bayam ga undi, salary and status expectations ki reach kaani person's life ento kuda artham aitaledu.Asalu ammai lanu e generation lo chustunte marriage avasarama ani kuda anipistundi.. evari life lo eppudu elanti ammai vastundo telidu.. sardukupovadame life kadu .. happy ga single life lead cheyadame better..
రిప్లయితొలగించండిThank you so much
తొలగించండి