లవ్ చేశారా?.. అయితే చదవండి

ప్రేమ.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఆస్వాదించి తీరేదే. నువ్వు పుట్టిన క్షణం నుంచి అమ్మానాన్న ఇచ్చే స్వచ్ఛమైన ప్రేమ తర్వాత.. వయసు ఎదుగుతున్న కొద్దీ మరో రకమైన ప్రేమను ప్రతి ఒక్కరం అనుభవించే ఉంటాం. అది కాలేజీ లవ్ కావచ్చు, పెళ్లి తర్వాత పార్ట్‌నర్ ఇచ్చే ప్రేమ కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో ప్రేమ అనే ఆ రెండు అక్షరాలకు మన జీవితంలో పెద్ద చాప్టరే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడో ఒకసారి ప్రేమించే ఉంటారుగా. అయితే చదవండి.. మీ జీవితంలో భాగమైన అందమైన ప్రేమ గురించి నాతో పంచుకోండి.

లవ్ చేశారా?.. అయితే చదవండి

ప్రేమ అనేది మనసుకు సంబంధించిందని అందరం అనుకుంటాం. కానీ, అది మైండ్‌కి సంబంధించింది. ఈ సినిమాల్లో అంతా మనసుకు గాయం, మనసు గతి ఇంతే అని ప్రేమ అంటే మనసు గురించే అన్నట్లు పాటలు పాడుతారు. అదంతా నమ్మకండి. నువ్వు నీ పార్ట్‌నర్‌ని అర్థం చేసుకునే విధానం బట్టి నీ రిలేషన్ ఎలా ఉండాలో ఆధారపడి ఉంటుంది. నువ్వు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తున్నావని నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు మెంటల్లీ ఫిక్స్ అయినప్పుడు. అలా ఫిక్స్ అయిన మనిషి నీకు నిజంగా కావాలనుకుంటే ఎప్పటికీ మిస్ అవ్వవు.. అవ్వాలని అనుకోవు.

లవ్ చేశారా?.. అయితే చదవండి

మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో.. వాళ్లకే ఎక్కువ భయపడతాం. ప్రేమించిన వాళ్లు పక్కన ఉంటే గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్లంతా చెమటలు పడతాయ్. మొహంలో తెలియని ఓ కంగారు కనిపిస్తుంది. వాళ్ల కళ్లలోకి కూడా సూటిగా చూడలేం. హా చాల్లే.. ఇదంతా సినిమాల్లోనే ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా ప్రేమిస్తే ఇలాంటివి ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఆకాశంలో ఉరుములు ఉరమడం, మెరుపులు మెరవడం, చూపులు వీపుకి గుచ్చుకోవడం.. ఇలాంటివి అయితే నాకు తెలిసి జరగవు. మీకేమైనా జరిగాయేమో మరి, నాకైతే తెలీదు..!

లవ్ చేశారా?.. అయితే చదవండి

ఒక మనిషిని నువ్వు నిజంగా ప్రేమిస్తే.. వాళ్లు చేసిన తప్పుల్ని కూడా క్షమిస్తావు. అది ఎంతలా అంటే నీ ఐడెంటిటీ నువ్వే కోల్పోయేంత. నిజంగా ప్రేమిస్తే అలాగే ఉంటారు కూడా. అందుకే త్రివిక్రమ్ గారు ఏదో సినిమాలో చెప్పినట్లు.. 'ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ల తప్పుల్ని కూడా క్షమించగలగాలి లేదా వాళ్లను మనం ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి'. చేసిన కొన్ని తప్పుల్ని లెక్క పెట్టుకుని గొడవలు పడే బదులు, వాళ్లతో కలిసి హ్యాపీగా ఉన్న రోజులని గుర్తు తెచ్చుకోండి. ఉన్నది ఒక్క జీవితం.. ఎందుకు బాస్ మనకు ఈగోలు. తప్పు చేశారని తెలిసినా సరే నవ్వుతూ మాట్లాడి చూడు, వాళ్లు ఆ తప్పు ఎందుకు చేశామా అని అక్కడే సగం చచ్చిపోతారు.

లవ్ చేశారా?.. అయితే చదవండి

ప్రేమించిన మనిషి కష్టాల్లోనో, ఏదైనా బాధలోనో ఉన్నారంటే అక్కడ మన అవసరమే ఎక్కువగా ఉందని ఫీలయ్యారంటే మీది నిజమైన ప్రేమే. ఎంత దూరంలో ఉన్నా నా అనుకునే వాళ్ల కోసం పరిగెత్తుకుని వెళ్తాము. ఏం జరిగినా నేను చూసుకుంటానని ధైర్యం చెప్పడమే మీ ప్రేమకు ఉన్న లోతు. వాళ్ల సమస్యని మనకొచ్చిన సమస్యలాగా అనుకుని తోడుగా ఉంటాం. వాళ్లు బాధ పడితే మనమూ ఏడుస్తాం. నువ్వు ఏడ్చిన ఆ కన్నీటి బొట్ల విలువ ఎవరికీ తెలియనవసరం లేదు. నువ్వు ఎవరి కోసమైతే అంత చేశావో కనీసం ఆ ఒక్క మనిషికి తెలిస్తే చాలు.. తన కోసం ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ ఒక్క మనిషికి అర్థమైతే చాలు.

లవ్ చేశారా?.. అయితే చదవండి

ఒక మనిషి కోసం ఎంతైనా చేయొచ్చు.. ఏ కష్టం లేకుండా చూసుకోవచ్చు.. నీ కన్నా గొప్పగా ఈ ప్రపంచంలోనే ఎవరూ చూసుకోలేదు అన్నంతగా ప్రేమించొచ్చు. ఏం అడిగినా కాదనకుండా హెల్ప్ చేయొచ్చు. నీ మనిషి కోసమే కదా నువ్వు చేస్తున్నావని నమ్మి చేసినట్లే, అవతలి మనిషి కూడా అదే రకంగా ఫీల్ అవ్వాలి. లేదంటే ఆ క్షణం నుంచే నువ్వు ప్రాణంగా ప్రేమించే వాళ్ల దృష్టిలో తక్కువ అవుతావు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితే కడుపు నిండుతుంది, అసలు ఆకలే లేదు అన్నవాళ్లకు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించినా దాని విలువ వాళ్లు తెలుసుకోలేరు. నీ మనసు మంచిది బంగారం.. అనవసరంగా దాన్ని విలువ తెలియని వాళ్లకు ఇచ్చి వృథా చేసుకోకు.

లవ్ చేశారా?.. అయితే చదవండి

గొడవలు వస్తాయ్.. అసలు గొడవలే లేకుండా ఏ రిలేషన్ ఉండదు. గొడవలు వస్తున్నాయని రిలేషన్ దూరం చేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. వస్తే రానీ.. ఏమవుతుంది? విడిపోతామన్న ఆలోచన మీలో లేనప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా ఏమీ కాదు. గొడవలు వస్తే మాట్లాడుకోవాలి.. తప్పులు చేస్తే సారీ చెప్పుకోవాలి. ఏది ఏమైనా కలిసే ఉండాలి. ఒకసారి చేయి పట్టుకున్నాక వదిలే ప్రసక్తే ఉండకూడదు. చిన్న చిన్నవాటికే దూరం చేసుకోవాలని మీకు అనిపిస్తే అది అసలు ప్రేమే కాదు. ఎన్ని గొడవలు వచ్చినా మర్చిపోయి మళ్లీ మళ్లీ మీ దగ్గరికే వస్తున్నారంటే వాళ్లకు క్యారెక్టర్ లేదని కాదు.. వాళ్లకు వాళ్ల కంటే మీ మీదే ఎక్కువ ఇష్టమని. 

లవ్ చేశారా?.. అయితే చదవండి

ప్రతి మనిషికి ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది. ఎంతగా ప్రేమించే మనుషులు ఉన్నా కూడా వాళ్లకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉంచుకుంటారు. కొన్ని సీక్రెట్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్‌పుల్‌గా చెప్పాలంటే.. ఫోన్ పాస్‌వర్డ్ లాంటివి పెట్టుకోవడం, కొన్ని లాక్ సిస్టమ్స్ లాంటివి మెయింటైన్ చేయడం అన్నమాట. నిజంగా మీ జీవితంలో వాళ్లు అంత ముఖ్యం అనుకుంటే ఇష్టమైన వాళ్ల దగ్గర అలాంటివి దాస్తామా? ఒకవేళ వాళ్లు మీ మొబైల్ ఓపెన్ చేసి చూసినా తప్పుగా అనుకోలేం. అదెలా అంటే, నిజంగా మీరు ఏ తప్పూ చేయనప్పుడు. అలాంటివి మెయింటైన్ చేస్తున్నారు, దాస్తున్నారు అంటే మీ గురించి మీరే ఆలోచించుకోండి ఇక. సీక్రెట్స్ మెయింటైన్ చేయండి.. తప్పు లేదు.. అది ఎంతవరకు అంటే, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లను బాధపెట్టే పని మీరు చేయనంత వరకు.

లవ్ చేశారా?.. అయితే చదవండి

ఒక మనిషితో రిలేషన్ మెయింటైన్ చేస్తూ.. వేరే వాళ్లకు హద్దులు దాటి చొరవ ఇస్తున్నారంటే మీది నిజమైన ప్రేమ కాదు. నిజంగా ప్రేమించేవాళ్లు ఎప్పుడూ తాము ప్రేమించేవాళ్లకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు.. ఆ తర్వాతే ఎవరైనా. అలా కాకుండా ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పి, మిగతా వాళ్లకు కూడా వాల్యూ ఇవ్వడం, వేరేవాళ్లను ముద్దుగా పిలుచుకోవడం.. బుజ్జి, కన్నా, బంగారం అని ట్రీట్ చేయడం చాలా తప్పు. ప్రేమిస్తే వాళ్లే మీ లోకం కావాలని నేను అనట్లేదు. కానీ వాళ్లని పక్కన పెట్టి వేరేవాళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు అంటున్నా. నిజంగా నువ్వు ప్రేమలో ఉంటే వేరేవాళ్లను అలా పిలవలేవు.. పిలవడానికి మనసు కూడా రాదు. వేరేవారిని అలా పిలిచారు, క్లోజ్ ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని ప్రేమించేవాళ్లు తట్టుకోలేరు. మీరంటే వాళ్లకు ప్రాణం, ప్లీజ్ అలాంటివారిని బాధ పెట్టకండి. నీకే.. బుద్ధి ఉందా కొంచెమైనా. నిన్ను అంత ఇష్టపడేవాళ్లు ఉండగా కూడా ఇలా చేసి ఎందుకు వాళ్లని బాధ పెడతావు? 

లవ్ చేశారా?.. అయితే చదవండి

నిన్ను ప్రేమించే మనిషి మాటిమాటికీ నాతో మాట్లాడు, నువ్వు కావాలి, టైం ఇవ్వు, మిస్ అవుతున్నా అంటే వాళ్ల మీద చికాకు పడొద్దు. అలా ఉండేవాళ్లు దొరకడం నిజంగా నీ అదృష్టం. ఎంత లవ్ ఉంటే అలా అడుగుతారు చెప్పు. వాళ్లు నీతో ఒక జీవితం మొత్తం ఊహించేసుకున్నారు, నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. కానీ, మన దరిద్రం ఏంటంటే.. అలా అడిగేవాళ్లనే చాలా తక్కువగా లెక్క కట్టేస్తాం. మరీమరీ నీ వెంట పడుతున్నారంటే వాళ్లకు ఇంకా ఏ పనీపాటా లేక కాదు. ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నారని. దానికి నువ్వు పెట్టి పుట్టాలి. అది అర్థం చేసుకోవడం మానేసి ఊరికే కసురుకుంటావు, ఏం పోయే కాలం నీకు?

లవ్ చేశారా?.. అయితే చదవండి

ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఒక్క మెసేజ్ పెట్టలేనంత బిజీగా ఏం ఉండరు, ఎంత బిజీగా ఉన్నా ఇష్టమైన వాళ్లతో మాట్లాడడానికి ఏదో ఒక దారి వెతుక్కుంటారు. నువ్వు కొంచెం దూరంగా ఉన్నా, అవాయిడ్ చేసినా నిన్ను ఇష్టపడ్డ వాళ్లు తట్టుకోలేరు. నువ్వు బిజీ ఉంటే ఉండు. కానీ నీ కోసం ఎదురుచూసే మనిషికి అదేంటో చెప్పు.. పాపం వాళ్లు కంగారు పడతారు. నువ్వు ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే ఆ మనిషిని ఎప్పటికీ కన్ఫ్యూజన్‌లో పెట్టవు. ఏదైనా క్లారిటీ ఇస్తావు. నీకు ఏం జరిగినా ఫస్ట్ ఆ మనిషితోనే చెప్పుకోవాలి అనుకుంటావ్. అప్పుడే నువ్వు ఆ మనిషికి నిజంగా వాల్యూ ఇచ్చినట్లు. ఏదో ప్రపంచం మునిగిపోయేంత కష్టం నీ ఒక్కడికే వచ్చినట్లు బిల్డప్ ఎందుకు నీకు? అలా మీరు ప్రేమించిన మనిషి మీతో అన్ని చెప్పుకోవట్లేదు, దూరం పెడుతున్నారు అంటే నా మాట విని సైడ్ అయిపో అంతే.

లవ్ చేశారా?.. అయితే చదవండి

ప్రాణంగా ప్రేమించిన మనిషి దూరమైతే తట్టుకోవడం చాలా కష్టమే. కొంతమంది వాళ్లను తలుచుకుంటూ, బాధ పడుతూ, వాళ్లతో ఉన్న స్వీట్ మెమొరీస్ గుర్తు చేసుకుంటూ అలా ఉండిపోతారు అంతే. అదే సమయంలో అవతలి మనిషి కూడా నీలాగే బాధ పడతారని గ్యారంటీ ఇవ్వలేం. వాళ్లు నిజంగా ప్రేమించి ఉంటే మిమ్మల్ని వదులుకుని మాత్రం సంతోషంగా ఉండలేరు. గట్టిగా మాట్లాడాలంటే.. నువ్వు ఎంత నిజాయితీగా ప్రేమించినా అది అర్థం చేసుకోలేని మూర్ఖులు కూడా కొందరు ఉన్నారు ఈ సమాజంలో. నీలాంటి బంగారాన్ని వద్దు అనుకుంటున్నారంటే వాళ్లకు అదృష్టం లేదు అంతే. అందుకే దూరమయ్యారని బాధ పడడం మాని ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో.

లవ్ చేశారా?.. అయితే చదవండి

ఓయ్.. అలా అని నువ్వే ఏదో పెద్ద గొప్ప అని ఫీల్ అయిపోయి మురిసిపోకు. అన్నిట్లో తప్పు వాళ్లదే అనట్లేదు.. కొన్నిసార్లు నీ తప్పు కూడా ఉండొచ్చు. ప్రేమించినవాళ్లను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్.. బిజీగా ఉన్నానంటే టైం ఇచ్చి చూడు.. నీ ప్రేమ నిజమైతే, వాళ్లకు కూడా మీరు నిజంగా అవసరం అనుకుంటే ఎన్ని అడ్డంకులు ఉన్నా మీకోసం ఎంత దూరమైనా వస్తారు. నన్ను నమ్మండి.. ప్రేమించండి.. పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.

లవ్ చేశారా?.. అయితే చదవండి

చదివితే సోదిలాగే ఉంటుంది. కానీ, అనుభవిస్తే ఇదంతా మీ జీవితంలా ఉంటుంది. ఇందులో కొన్ని నాకు తెలిసినవి, అనిపించినవి, కొన్ని అనుభవించినవి కూడా ఉన్నాయ్. మీరు కూడా ఎవరైనా ఇష్టమైన మనిషిని బాగా మిస్ అవుతున్నారా? నాతో కామెంట్ ద్వారా పంచుకోండి. మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయిన వ్యక్తికి ఇది షేర్ చేయండి. అప్పుడు మీలో ఉన్న మాటలు ఇలా చెప్పినట్లు అవుతుంది. అలా అయినా వాళ్లు మీ ప్రేమను అర్థం చేసుకుంటారేమో..!!!


THANK YOU 

PC: CH. VAMSHI MOHAN 


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి