మహావతార్ నరసింహ

పేరున్న పెద్ద హీరో లేడు..  కమర్షియల్ హంగులు అసలే లేవు.. కానీ, థియేటర్లకి జనం క్యూ కడుతున్నారు.. ముఖ్యంగా యూత్ కూడా ఎక్కువగా వస్తున్నారు.. ఎప్పుడూ లేనిది సాధు, సత్సంగులు సినిమా చూడటానికి వస్తున్నారు.. భజనలు చేస్తున్నారు.. సినిమా హాళ్లన్నీ దేవాలయాలుగా మారిపోతున్నాయి.. హాలు బయటే చెప్పులు విడిచి లోపలికి వెళ్లి సినిమా చూస్తున్నారు.. ఎటు చూసినా భక్తి భావం వెల్లివిరుస్తోంది. ఏంటీ.. ఒక సినిమా వల్ల ఇంత జరుగుతుందా?.. ఒక సినిమా ఇంతలా జనాల్ని మార్చిందా?.. అందరిలాగే నాకూ ఇలాంటి ప్రశ్నలే వచ్చాయి. ఆ తర్వాతే అనిపించింది.. ఈ సినిమాకి పెద్ద హీరో ఎందుకు లేడు.. ఉన్నాడుగా అని.. ఆయనే నరసింహ స్వామి.

మహావతార్ నరసింహ

'మహావతార్ నరసింహ'... సినిమా ఈ మధ్యే వచ్చింది, చాలా మంది వెళ్లి చూస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని మీకూ తెలిసే ఉంటుంది. మీలో చాలా మంది ఈ సినిమా ఇప్పటికి చూసే ఉంటారు. పురాణాల ప్రకారం.. దశావతారాల్లో ఒకటైన నరసింహ స్వామి అవతారం గురించి, దుష్ట శిక్షణ గురించి ఈ సినిమాలో చూపించారు. ప్రహ్లాదుడి అచంచలమైన భక్తికి సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఉగ్ర అవతారమే ఈ నరసింహ అవతారం.మహావతార్ నరసింహఒక రకంగా ఇలాంటి సినిమాలు రావడం మంచిదే అనిపించింది. రోజురోజుకీ మర్చిపోతున్న పురాణ కథలను, వాటి వెనక అంతరార్థాన్ని, హిందుత్వ విలువలను మరోసారి గుర్తు చేసేలా.. ఇంకెప్పటికీ మర్చిపోకుండా.. అందరికీ నచ్చేలా ఇలా సినిమాలాగా ఈ తరానికి తెలియజేయడం మంచిదే. పైగా ఇప్పుడున్న పిల్లలకి సూపర్ హీరోలు ఎవరని అడిగితే.. అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లాంటి పేర్లే చెప్తారు. అంతకన్నా గొప్ప హీరోలు మన పురాణాల్లోనే ఉన్నారు, వాళ్లు చేసిందేంటి?.. ఎందుకు వాళ్లని మనం భక్తితో మొక్కుతున్నాం..? దేవుళ్లు అని ఎందుకు కొలుస్తున్నామో ఇలా అయినా ఇప్పటివాళ్లకు తెలిసే అవకాశం ఉంటుంది.మహావతార్ నరసింహప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే మహా విష్ణువుకు పరమ భక్తుడు.. తన తండ్రి హిరణ్యకశిపుడికి విష్ణువు అంటే అస్సలే పడదు. అందుకే హరి భక్తి మానుకోమని ప్రహ్లాదుడిని చాలా సార్లు హెచ్చరిస్తాడు. తన మాట వినడం లేదని కన్నకొడుకు అని కూడా చూడకుండా చంపేయమని చెప్తాడు.. అలా చిన్న వయసులోనే ప్రహ్లాదుడు ఆ శిక్షలన్నీ భరిస్తాడు.. ఎన్ని బాధలు పెట్టినా నారాయణ స్మరణ మాత్రం మానుకోడు.. చివరికి మహా విష్ణువే ప్రహ్లాదుడి కోసం నరసింహ అవతారంలో వెలిసి రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే.. సినిమాలో కూడా ఇదే చూపించారు సరే.. మరి దీన్నుంచి మనం ఏం తెలుసుకున్నాం..? నిజంగా నువ్వు మనస్ఫూరిగా నమ్మితే దేవుడు తప్పకుండా బదులిస్తాడు.. ఆలస్యమైనా నమ్ముకున్న వాళ్ల కోసం ఖచ్చితంగా వస్తాడు.. అండగా ఉంటాడు.. ఎల్లప్పుడూ రక్షిస్తుంటాడని ప్రహ్లాదుడి ద్వారా మనకు ఆ భగవంతుడు నిరూపించినట్లేగా... ఆలోచించండి.మహావతార్ నరసింహహా.. ఊరికే చెప్పడానికి వచ్చావు.. ఇవన్నీ జరిగాయో లేదో ఎవరికి తెలుసు.. నువ్వేమైనా చూశావా.. ఏదో గుడ్డిగా నమ్ముతున్నావు.. అసలు దీనికి ఆధారం ఏంటి?.. ఇలా జరిగిందని ఎవరైనా చూశారా? అని చాలా మందికి అనుమానాలు ఇప్పటికి వచ్చే ఉంటాయి. అవును.. మీరు అలా అనడంలో, అడగడంలో అర్థం ఉంది. కాదనను.. అలా అని మీ నమ్మకాన్ని దాటి నేను చెప్పేది నిజమేనని ఒప్పుకోవాలని కూడా అనను. అందుకే దేవుడు అంటే ఎవరు? అని ఇంతకు ముందు నేను ఓ ఆర్టికల్ రాశాను. అది చదివితే ఇప్పుడు నేను రాస్తున్న దానికి, మీ అనుమానాలకు కూడా సమాధానం దొరుకుతుందని భావిస్తున్నా. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.మహావతార్ నరసింహఇకపోతే, నరసింహ స్వామి ఇలా వెలిసింది మరెక్కడో కాదు.. మన దగ్గరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉన్న అహోబిలం పుణ్యక్షేత్రంలోనే ఇదంతా జరిగింది. నరసింహ స్వామి ఉగ్రమూర్తి రూపంగా చీల్చుకుని అవతరించిన ఆ స్తంభాన్ని కూడా ఇప్పటికీ మనం అక్కడ దర్శించుకోవచ్చు. ఉగ్ర స్తంభం అనేది ఎగువ అహోబిలం దగ్గర సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణం. ఇది నల్లమల అడవుల మధ్య ఎత్తైన కొండపై ఉంటుంది. అక్కడి వరకూ వెళ్లడం కొంచెం కష్టమైన పనే. కానీ, దర్శించుకోవాలన్న కోరిక ఉండే చాలా మంది కష్టమైనా భక్తితో వెళ్తూ వస్తూ ఉంటారు. మీరూ అక్కడికి వెళ్లినట్లయితే ఆ అద్భుతమైన అనుభవాన్ని నాతో పంచుకోండి.మహావతార్ నరసింహమహావతార్ నరసింహ'మహావతార్ నరసింహ' ఒక యానిమేటెడ్ మూవీ.. చాలా చక్కగా తీశారు.. ఆ విజువల్ ఎఫెక్ట్స్ అంత బాగా రావడానికి చాలా కష్టపడ్డారు ఆ మూవీ టీమ్ అనిపించింది. చూస్తున్నంతసేపు ఆ దృశ్యాలు నన్ను కట్టిపడేశాయి.. పురాణ కథని అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా వివరించి తీశారు.. మరీ ముఖ్యంగా వరాహ స్వామి, నరసింహ స్వామి వచ్చే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి.. చేయెత్తి మొక్కేలా చేశాయి.మహావతార్ నరసింహమహావతార్ నరసింహచివరగా.. నాకు బాగా నచ్చిన, నేను భావోద్వేగానికి లోనైన ఇందులోని ఓ సన్నివేశం గురించి మీతో పంచుకుంటా. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత నరసింహ స్వామి తన ఉగ్రరూపాన్ని విడిచిపెడుతూ ప్రహ్లదుడిని ప్రేమగా దగ్గరికి తీసుకుని తనపై కూర్చోబెట్టుకోవడం. ఆహా.. స్వయంగా భగవంతుడే దిగి వచ్చి ఒక భక్తుడిపై అంత వాత్సల్యం కురిపించడం కన్నా అద్భుతం మరొకటి ఉంటుందా చెప్పండి.. అంతటి అదృష్టం ఎలా ఉంటుందో మన ఊహకి కూడా అందదు.. మనిషి పుట్టుకకు అంతకన్నా గొప్ప సార్థకత ఇంకోటి ఉంటుందంటారా?.. ప్రహ్లాదుడు చేసుకున్న పుణ్యం మనకు కూడా కలిగితే బాగుండునని ఎవరికి ఉండదు చెప్పండి.. అంతటి అదృష్టం మనకు వస్తుందో లేదో తెలియదు కానీ, అందుకు మార్గం మాత్రం నాకు తెలుసు.. ఈ ఒక్క మాట ఎప్పుడూ మనసులో స్మరించుకుంటే చాలేమో...

'ఓం నమో భగవతే వాసుదేవాయ...'

మహావతార్ నరసింహ




THANK YOU

PC: CH.VAMSI MOHAN


మహావతార్ నరసింహ




కామెంట్‌లు

  1. ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    నిజంగా అద్భుతమైన సినిమా...మనసు పులకరించే సన్నివేశం ప్రహ్లాదుడు ఆ దేవదేవునిపై కూర్చున్నప్పుడు అయితే,మనకు తెలీకుండానే మనసు కరిగి కన్నీరు కార్చే సన్నివేశం ప్రహ్లాదుడు నేను ఆ దేవదేవుని దర్శనానికి అర్హుని కానేమో అని ఏడ్చే సన్నివేశం... భక్తాదుల్ని ఏకం చేసిన సినిమా ...ఆ సినిమా ని అందంగా వివరించి చూడని వాళ్ళలో ఇంకా ఆలస్యం ఎందుకన్నట్లు ఊరించి..వివరించి వర్ణించారు...చాలా బాగా రాశారు అన్నా...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి