జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?

 జ్ఞానవాపి మసీదు.. ఈ మధ్య మళ్లీ వార్తల్లో బాగా వినబడుతున్న పేరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగమైన కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకునే మనం మాట్లాడుకుంటున్న జ్ఞానవాపి అనే ప్రదేశం ఉంది. ఈ ప్రాంతం మొదటి నుంచి హిందూ ఆలయానికి సంబంధించినదని హిందువులు వాదిస్తుంటే.. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే నమాజులు చేస్తున్నాం, ఇది మా మసీదు అని ముస్లింలు అంటున్నారు. ఈ మధ్యనే ఎన్నో ఏళ్ల పోరాటం, ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి బాల రాముడు పూజలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు శివయ్య వంతు వచ్చిందన్న మాట.

జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?

అసలు జ్ఞానవాపి అంటే ఏంటో చూద్దాం. సంస్కృతంలో జ్ఞాన అంటే జ్ఞానం, వాపి అంటే బావి అని అర్థం. అంటే Well of Knowledge అన్నమాట. మసీదు ప్రాంగణంలో ఉన్న ఓ బావిలో శివలింగం ఉందని హిందువులు అంటుంటే, అది జస్ట్ ఒక ఫౌంటెన్ మాత్రమే శివలింగం కాదని ముస్లింల వాదన. అదే బావిని ముందు నుంచి ముస్లింలు వదుఖానా (ప్రార్థనకు ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతం)గా ఉపయోగించారు. అంటే.. ఏ బావిలో అయితే శివలింగం ఉందని మనం అంటున్నామో.. అందులోనే ముస్లింలు ఇన్ని రోజులు కాళ్లు కడుక్కున్నారు అన్నమాట. అయితే అసలు జ్ఞానవాపి వివాదం ఎలా మొదలైంది? ఎందుకు దీని గురించి ఇంత చర్చ నడుస్తుందనేది మనం తెలుసుకుందాం.

జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?

దాదాపు 2000 ఏళ్ల క్రితం విక్రమాదిత్యుడు అనే రాజు ఆది విశ్వనాథ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే.. గతంలో ఎందరో ముస్లిం రాజులు భారతదేశంపైకి దండయాత్రకు వచ్చి ఇక్కడి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం మనకు తెలిసిందే కదా. అలా 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి అక్కడి హిందూ రాజుని ఓడించి ఈ విశ్వనాథ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశాడట. దీంతో మిగిలిన ఆ కొంత ఆలయ భాగంలోనే హిందువులు పూజలు చేసుకున్నారు. తర్వాత 1211లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి మళ్లీ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత చాలా సార్లు ముస్లిం రాజులు మళ్లీ మళ్లీ దండెత్తి రావటం, ఇక్కడి ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరుగుతుండేది. అలా ఈ ఆలయం శిథిలం కావడంతో 1500వ సంవత్సరంలో మళ్లీ నిర్మించుకున్నారు. నన్ను అడిగితే.. ఒక రాజుగా ఇతర దేశాల మీద దండెత్తడం, వాటిని ఆక్రమించుకోవడం మీ హక్కు అయి ఉండొచ్చు.. కానీ, కష్టపడి కట్టుకున్న మందిరాలను కూల్చి హిందుత్వాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?

జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
1669లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భారతదేశంపైకి దండయాత్రగా వచ్చి ఈ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదు కట్టాడు. ఆ సమయంలో గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని కూడా ధ్వంసం చేస్తారనే భయంతో ఆ ఆలయ పూజారి శివలింగాన్ని అక్కడే ఉన్న బావిలో పారవేశాడని చరిత్రలో ఉంది. శివలింగంతో పాటు ఆ పూజారి కూడా బావిలో దూకేశాడని మరికొందరు చెబుతున్న మాట. అక్కడ బావి ఉండడం వల్ల అప్పటి నుంచి దాన్ని జ్ఞానవాపి అని పిలవడం మొదలుపెట్టారు. కానీ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయకపోవడంతో పైభాగం, ముందు భాగం మసీదులాగే ఉన్నా.. వెనక భాగంలో హిందూ ఆలయానికి సంబంధించిన గోడ అలాగే ఉండిపోయింది. అది ఆలయానికి సంబంధించిన గోడే అని కింద ఇచ్చిన ఫొటోలో మీరు కూడా చూడొచ్చు. స్పష్టంగా ఆధారం ఉన్నా కూడా ఇంకా ఏం నిరూపించాలి?
జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
ఇక, 1780లో వారణాసి నగరం ముస్లిం రాజుల నుంచి బ్రిటీషర్ల ఆధీనంలోకి వెళ్లింది. అప్పుడు హిందూ మతానికి చెందిన మరాఠా రాజులు బ్రిటిషర్లతో ఒప్పందం చేసుకుని పాలించారు. పాలించేది హిందువులే కాబట్టి అక్కడ మళ్లీ ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. కానీ అప్పటికే మసీదులా ఉన్న ఆ ప్రాంతాన్ని కూల్చివేస్తే మళ్లీ హిందూ, ముస్లింలకు గొడవలు వస్తాయని భావించి ఆ మసీదు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో శివాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయాన్ని నిర్మించింది అహిల్యాబాయి హోల్కర్ అనే మహారాణి. అదే ప్రస్తుతం మనం పూజిస్తున్న కాశీ విశ్వనాథ ఆలయం.
జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
కానీ, అసలు నిజమైన శివలింగం ఉన్నది మసీదు ఉన్న ప్రాంతంలో అనేది హిందువులు ఇంకా మర్చిపోలేదు. దీనివల్ల ఎప్పుడూ అక్కడ హిందువులు, ముస్లింలకు గొడవలు వచ్చేవి. ఈ గొడవల్లో భాగంగా 1809లో ముస్లింలు ఒక ఆవును చంపి దాన్ని జ్ఞానవాపి బావిలో వేశారట. ముస్లింలు ఇలా చేయడంతో హిందువులకు కోపం వచ్చి మసీదును కూల్చడానికి ప్రయత్నించారు. అప్పుడు గొడవల్లో చాలా మంది చనిపోయారు. 1859లో హిందూ మహాసభ గ్రూపుకు సంబంధించిన కొందరు మసీదు లోపలికి వెళ్లి అక్కడ రుద్రాభిషేకం చేశారట. దీనిపై ముస్లింలు తిరగబడడంతో గొడవలు, అరెస్టులు, కొందరి ప్రాణాలు కూడా పోవడం జరిగింది.
జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
చాలా ఏళ్ల తర్వాత 1984లో విశ్వ హిందూ పరిషత్ మసీదు ప్రాంతం హిందువులదే అని, అది తమకు అప్పగించాలని కోర్టులో కేసు వేసినప్పటికీ అది చెల్లలేదు. ఎందుకంటే.. Places of Worship Act 1991 అనే చట్టం తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. దాని ప్రకారం ఏదైనా ఒక ప్రదేశంలో ఒక మతానికి చెందినవారు ప్రార్థనలు చేస్తున్నట్లయితే.. ఆ స్థలాన్ని ఇంకో మతానికి చెందిన స్థలంగా మార్చలేమని ఆ చట్టంలో ఉంది. అలా ఎందుకు చేశారంటే.. సరిగ్గా అదే సమయంలో అయోధ్య విషయంలో బాబ్రీ మసీదు ప్రాంతాన్ని అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్లీ విశ్వనాథ ఆలయం విషయంలో కూడా అలాగే జరగడం ఇష్టం లేని అప్పటి ప్రభుత్వం ఇలాంటి చట్టం తెచ్చిందనే మాట వాస్తవం. అదే విధంగా..1993లో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్.. మసీదు కింది భాగంలో ఉన్న దేవతా విగ్రహాలకు పూజలు జరగకుండా ఆపివేయించాడు. 
జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
2021లో శృంగార గౌరీ అమ్మవారి పరమ భక్తులైన వారణాసికి చెందిన ఐదుగురు మహిళలు.. అది హిందూ ఆలయం అని, అక్కడ తాము పూజలు చేసుకుంటామని కోర్టుని ఆశ్రయించారు. ఈసారి విశ్వ హిందూ పరిషత్ మరో కేసు వేసింది. ఆర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI)తో జ్ఞానవాపి మసీదుపై వీడియోగ్రఫీ ద్వారా సర్వే చేయించాలని, అసలు అక్కడ ముందు నుండి మసీదు ఉందా?.. లేక హిందూ దేవాలయం కూల్చివేసి మసీదు కట్టారా? అనేది తేల్చాలని కోరింది. ఆ సర్వేలో ఏం తేలిందంటే.. మసీదు లోపల గోడలపై కన్నడ, తెలుగు, దేవనగరి భాషల్లో రాతలు ఉన్నాయని.. శివుడు, హనుమంతుడు, కృష్ణుడు మొదలైన హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయని, జ్ఞానవాపి బావిలో శివలింగం లాంటి ఆకారం ఉందని క్లారిటీ ఇచ్చింది. ఇక 2024, జనవరి 31న జ్ఞానవాపి మసీదు వివాదంలో వారణాసి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు కింది భాగంలో ఉన్న ప్రాంతంలో హిందువులు పూజలు చేసుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో 1993లో ఆగిపోయిన పూజలు 2024, ఫిబ్రవరి 1న మళ్లీ మొదలయ్యాయి.
జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
మసీదు వెనక భాగం హిందూ ఆలయంలా ఉండడం, బావిలో శివలింగం లాంటి ఆకారం ఉండడంతో పాటు మసీదు లోపల ఉన్న దేవతా విగ్రహాలు ఇది హిందూ దేవాలయమేనని తామే సాక్ష్యమని చెబుతున్నాయి. వీటన్నిటి కన్నా ముఖ్యంగా మసీదు ప్రాంగణంలో జ్ఞానవాపి బావివైపే చూస్తూ ఒక నంది విగ్రహం ఉంది. మామూలుగా మన దేశంలో ఏ శివాలయంలో అయినా శివుడిని చూస్తూనే నంది ఉంటుంది కదా.. ఆ లెక్కన నంది ముఖం మసీదును చూస్తుందంటే అక్కడే శివయ్య ఉన్నట్లు కదా? ఏళ్లుగా తన స్వామి ఇక్కడే ఉన్నాడని మనమంతా ఎప్పుడు గుర్తిస్తామో అన్నట్లుగా ఆ నంది.. శివయ్య వంక దీనంగా చూస్తోందా?
జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
ఇంతకంటే ఏం కావాలి..? అక్కడే శివయ్య ఉన్నాడని, ఆ ప్రాంతం హిందువులదే అని చెప్పడానికి. నందీశ్వరా.. రంకె వేసి మసీదు పునాదులను బద్దలు కొట్టి, ఏళ్లుగా మరుగున పడిన హిందూ మూలాలను కాపాడి నిజమేంటో లోకానికి చెప్పడానికి ఉన్న అతి పెద్ద సాక్ష్యం నువ్వే మాకు. ఏ రోజుకైనా ధర్మమే గెలుస్తుందని, శివుడి ఆలయం అని వాదిస్తున్న ఆ జ్ఞానవాపి ప్రాంతం విషయంలో న్యాయం జరగాలని కోట్ల మంది హిందువుల్లో ఒకడిగా నేను కూడా ఎంతో భక్తితో ఎదురుచూస్తున్నాను.
జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?

తన ఉనికి కోసం పోరాడుతున్న ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన ఇలాంటి విషయాలను మీరు కూడా మరొకరితో షేర్ చేసి హిందుత్వాన్ని కాపాడండి. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కింద లైక్ చేసి, ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి.

THANK YOU 

PC: CH. VAMSHI MOHAN




కామెంట్‌లు