A girl should be like you... Roopa

డియర్ రూపా...

A girl should be like you... Roopa
నువ్వు ఎంత అందంగా ఉంటావో, అంత ఇండిపెండెంట్ అమ్మాయివి కూడా. చిన్నప్పుడే అందరినీ పోగొట్టుకున్నావ్. నా అనే వాళ్లు లేకున్నా ఒక ఆడపిల్ల పెరగడం, జీవితంలో కష్టాలను దాటి ముందుకు సాగడం ఎంత కష్టమో నీ వల్లే అర్థం అయింది.. నీకు సంగీతం అంటే ఇష్టం.. కాఫీ అంటే ఇష్టం.. మనుషులు అంటే ఇష్టం.. అలా అని లిమిట్స్ దాటి నీ దగ్గర చొరవ తీసుకుంటే అరిచేస్తావ్.

A girl should be like you... Roopa
నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నీ మీద నీకు ప్రేమ ఎక్కువ. ఉండాలిలే అది ఏ ఆడపిల్లకి అయినా.. అది ఎంత అంటే నీ స్కూటీ కూడా వేరే వాళ్లకి ఇవ్వను అనేంతగా. నీకు నచ్చిన చీర విషయంలో కూడా రాజీ కానంత. మరి అందరూ ఏంటి రూప..? నువ్వు చీర కోసం పెళ్లి చెడగొట్టుకున్నావ్ అంటారు.. కానే కాదు... ఆడపిల్లవి కాబట్టి, నీలో సంస్కారం ఉంది కాబట్టి ముందు నిన్ను నువ్వు తగ్గించుకున్నావ్. కానీ, నీ ఆత్మగౌరవం విషయంలో ఊరుకోలేదు.. నువ్వు ఎక్కడా తగ్గలేదు రూప.. అదీ అమ్మాయంటే అలా ఉండాలి.. ప్రతి అమ్మాయి నీలా ఉండాలి.

A girl should be like you... Roopa
జీవితంలో అవసరానికి మించి ఎవరి కోసమూ రాజీ పడొద్దు అని నీ వల్లే తెలుసుకున్నా. మనకు రాసి పెట్టి ఉంటే ఆనంద్ లాంటి మనల్ని అర్థం చేసుకునే మనిషి తప్పకుండా వస్తారు.. నిన్ను నిన్నులా ఉంచుతారు అని ప్రూవ్ చేశావ్. నీ కోపం, ఆవేశం చూసి అందరూ నీకు పొగరు అనుకుంటారు. కాదు.. అది నీ మీద నీకు గౌరవం. అదే రూప అంటే..!

A girl should be like you... Roopa
అందుకే నువ్వు ఒక మాట చెప్తావు ఆనంద్‌తో కారులో వెళ్తూ.. "నువ్వు ఎప్పుడూ నాకు తక్కువ కాకూడదు.. నువ్వెప్పుడూ అక్కడ ఉండాలి" అని. కిచెన్‌లో ఆనంద్ అమ్మతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యి కాబోయే అత్తగారిని అమ్మ అని పిలిచేస్తావ్. నువ్వు ఏం కోరుకుంటున్నావో అక్కడ ఒక్క మాటలో చెప్పేశావ్.

A girl should be like you... Roopa
నువ్వు నీలా ఉంటావ్.. అది చూసి ఎదుటివాళ్లు నిన్ను ఇష్టపడేంత కాన్ఫిడెంట్‌గా ఉంటావ్.. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం రూప.


ఎప్పటికీ ఇష్టమే..... 💖

కామెంట్‌లు