బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?

గుంపులు గుంపులుగా వచ్చి అమాయకుల మీద దాడులు.. నడిరోడ్డుపైనే చిన్నాపెద్దా, ఆడ మగ అనే తేడా లేకుండా కొట్టడాలు.. కాళ్లతో తొక్కడాలు.. కళ్ల ముందే మానభంగాలు.. రక్తాలు కారుతున్నా కనికరించని పైశాచికత్వం.. ధ్వంసమవుతున్న హిందూ ఆలయాలు.. దేవతల విగ్రహాలు.. మంటల్లో తగలబడుతున్న ఇళ్లు.. ఎదుర్కొనే ధైర్యం లేక ఇంట్లోనే బందీలుగా మనుషులు.. తామేం తప్పు చేశామని అర్థం కాక బిత్తరచూపులు.. ఈ పూటకి బతుకుతామో లేదో తెలియక ఏడుపులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలు.. ఇవన్నీ బంగ్లాదేశ్‌లో నెల రోజులుగా కనబడుతున్న దృశ్యాలు.. హిందువులుగా పుట్టడమే వాళ్లు చేసిన పాపమా..?బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?ఇప్పుడు ఎక్కడ చూసినా బంగ్లాదేశ్ పేరు మార్మోగిపోతుంది. భయాందోళనలు, అల్లర్లు, హింసలు, దాడులు.. ఇలా గత నెల రోజులుగా వార్తల్లో ఇవే చూస్తున్నాం. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీని వెనక కారణాలు ఏంటి? హిందువులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఇంత దారుణం ఎందుకు మొదలైంది? బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి మరీ పారిపోయేంతగా ఏం జరిగింది? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?అసలేం జరిగింది?

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా ప్రజలు నెల రోజుల నుంచి నిరసనలు, దాడులు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. రిజర్వేషన్లు. మరి ఈ రిజర్వేషన్ల సంగతి ఏంటి? సమస్య రిజర్వేషన్లు అయితే అమాయకులైన హిందువుల మీద దాడులు ఎందుకు? 1971లో మన దేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు, వాళ్ల కుటుంబాలకు సివిల్ సర్వీస్ ప్రైవేట్ సెక్టార్ జాబ్ కోటాలో 30% రిజర్వేషన్ ఇచ్చింది అప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇది ఒక రకంగా మంచిదే.. ఎందుకంటే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ఎలాంటి ఆసరా ఉండదు. ఈ రిజర్వేషన్ పాలసీ వల్ల చాలా కుటుంబాలకు ఒక ఆధారం దొరికింది. అలా ఆ పాలసీ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?వివాదం ఎప్పుడు మొదలైంది?

2018, అక్టోబరులో బంగ్లాదేశ్ విద్యార్థులు కొందరు ఓ వివాదానికి తెర లేపారు. అదేంటంటే.. సైనికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు కాదు. కానీ, అది 1971 నుంచి ఇప్పటివరకు ఇలా ఇన్ని సంవత్సరాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒక రకంగా చూస్తే వాళ్ల వాదన కూడా కరెక్టే. ఎందుకంటే.. రిజర్వేషన్ల పేరుతో అలా ఇవ్వడం వల్ల చాలా మంది బాగా చదివేవాళ్లు, పేదరికం నుంచి వచ్చిన  విద్యార్థులు నష్టపోతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఈ కారణాలతో విద్యార్థులు ఆందోళనలు చేయడంతో ప్రధాని షేక్ హసీనా దిగొచ్చారు. రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్ ఎత్తేయడానికి నిర్ణయించారు. ప్రధాని నిర్ణయంతో మరోవైపు ఆ సైనికుల కుటుంబాలు కూడా దాన్ని ఆపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే, ఆ రిజర్వేషన్లు ఎత్తివేస్తే వాళ్లకు ఇంతకు ముందులాగా ఉద్యోగాలు దొరకవు కదా. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక అప్పటి నుంచి అంటే 2018 నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?ఇప్పుడు మరోసారి ఎందుకు వివాదం?

బంగ్లాదేశ్ హైకోర్టు 2024, జూన్ నెలలో సైనికుల కుటుంబాలు అప్పట్లో వేసిన పిటిషన్‌పై తీర్పు ఇస్తూ కొట్టివేసింది. అయితే తాజా లెక్కలు చూస్తే సైనికుల కుటుంబాలకు కేటాయించిన రిజర్వేషన్లు 56% వరకు ఉన్నాయి. ఆ లెక్కన మొత్తం జనాభాలో సైనికుల కుటుంబాలు 25% ఉన్నారు. అంటే 25 శాతం మాత్రమే ఉన్నవాళ్లకు 56% రిజర్వేషన్లు ఇస్తుంటే.. మిగతా 75 శాతం మంది 44% పంచుకోవాలా?.. ఇదెక్కడి న్యాయం అని ఎవరికైనా అనిపిస్తుంది. రిజర్వేషన్లు దక్కనివాళ్లలో బాగా చదువుకుని, టాలెంట్ ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలు దొరకక నష్టపోవాల్సిందే కదా. ఇదంతా ఇలా ఉండగా మొత్తానికి బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు.. మెరిట్ స్టూడెంట్స్ కి 93% ఇవ్వాలని, సైనికుల కుటుంబాలకు 7% ఇవ్వాలని తీర్పు ఇవ్వడంతో గొడవలు తగ్గిపోయాయి.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?ప్రధాని పారిపోయేంతగా ఏం జరిగింది?

అయితే.. వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. పోయిన నెలలో జరిగిన గొడవల్లో దాదాపు 150 మంది వరకు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. చాలా మంది విద్యార్థులను జైలులో వేశారు. దీంతో మిగతా విద్యార్థులు అందరూ కలిసి ప్రధాని క్షమాపణ చెప్పాలని, జైలులో ఉన్నవాళ్లని విడిపించాలని మళ్లీ గొడవలు మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన ప్రధాని.. 'ఒకప్పుడు విద్యార్థులు గొడవలు చేశారు.. ఇప్పుడు రజాకార్లు గొడవలు చేస్తున్నారా?' అని వివాదాస్పదంగా మాట్లాడారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?ప్రధాని ఇంట్లో విధ్వంసం

ప్రధాని హోదాలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని విద్యార్థులు మళ్లీ ఆందోళన మొదలుపెట్టారు. ఇక ఈసారి గొడవలు మరింత ముదిరాయి. గొడవల్లో భాగంగా బస్సులు, మెట్రో తగలబెట్టడం, పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయడం లాంటివి చాలా చేశారు. అందులో భాగంగానే ప్రధాని ఇంటి మీదికి కూడా వస్తున్నారని తెలిసి, పదవికి రాజీనామా చేసి అప్పటికప్పుడు షేక్ హసీనా దేశం వదిలిపెట్టి పారిపోయారు. దీంతో ఆందోళనకారులు ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను నాశనం చేయడం, కొన్ని ఖరీదైన సామాగ్రిని ఎత్తుకెళ్లడం, చివరికి ప్రధాని ధరించే చీరలు, మిగతా బట్టలను కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్లి నానా రచ్చ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?హిందువుల తప్పేంటి..?

ఇక్కడివరకూ బాగానే ఉంది.. మరి ఇందులో హిందువులు చేసిన తప్పేంటి..? విద్యార్థుల ఆందోళనలు, డిమాండ్లు ప్రభుత్వంపై, వాళ్లు తీసుకొచ్చిన రిజర్వేషన్లపై అయితే హిందువులను ఎందుకు టార్గెట్ చేశారు? జాలి, కనికరం లేకుండా ఎందుకు దాడులు చేస్తున్నారు? హిందూ ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టేలా ఎందుకు రాక్షసత్వం ప్రవర్తిస్తున్నారు? ఇతర మతాలను కూడా సమాన దృష్టితో గౌరవించే హిందువులపై ఎందుకు ఆగ్రహం చూపిస్తున్నారు? హిందూ దేవుళ్లను, గుళ్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? దీనికి పరిష్కారం ఎక్కడ?  ఈ మారణహోమంలో అమాయకులు బలి కావల్సిందేనా? దీనికి అంతం ఎప్పుడు?బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎందుకు?


ALL EYES ON BANGLADESH HINDUS


THANK YOU 🙏

PC: CH. VAMSI MOHAN 


కామెంట్‌లు

  1. Nice blog Rakesh, even I too don't know what is what clearly regarding this. Thanks for post this blog whom u don't know the exact reason.. and i hope expecting blogger next continuous Hindus war why the bangladesh people doing like cruelly on Hindus..
    Really nice narration u way explanation is good to understand in every common person..
    Al the best .. Rakesh
    Keep going😊

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి