అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

ఓయ్ సీతా..

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

నాకు నచ్చిన చాలా సినిమాల్లో ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ ప్రేమలో పడిపోయిన పాత్రల్లో నీదీ ఒకటి. తెలుగింటి ఆడపిల్లలా ఎంత బాగుంటావు సీతా.. నీ అమాయకత్వం, నీ మాటలు భలే ఉంటాయి. నువ్వు గోళ్లు కొరుకుతుంటే చూడడం నాకు ఇష్టం, ఆడపిల్లవే అయినా ఇండిపెండెంట్‌గా లైఫ్ లీడ్ చేయాలనుకునే నీ ఆలోచన ఇష్టం, ఏమీ తెలియకపోయినా అన్నీ నీకే తెలుసనుకునే నీ పెంకితనం ఇష్టం, మొండి వెధవ అని ఎవరైనా నిన్ను తిడితే నువ్వు పెట్టే నీ బుంగమూతి ఇష్టం. ఇంకా చాలా చాలా ఉన్నాయ్. అవన్నీ కలిపి నువ్వంటే ఎంత ఇష్టమో ఈ ఆర్టికల్ ద్వారా చెప్తా.. వింటావు కదా మరి..!

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

అందమైన గోదావరి.. అంతకంటే అందమైన పరిసరాలు.. చక్కటి లాంచీ.. ఆ లాంచీలో మరింత అందంగా నువ్వు. ఒక్కోసారి రెండు జడలు వేసుకుని, కళ్లజోడుతో క్యూట్‌గా అనిపిస్తావు. ఇంకోసారి చీర కట్టుకుని, జుట్టు విరబోసుకుని హాట్‌గా కనిపిస్తావు. మేము ఎలా అనుకుంటే ఏంటిలే.. నీకు నువ్వు మాత్రం క్వీన్ విక్టోరియాలా ఫీల్ అయిపోతావు.

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

మామూలుగానే మగాళ్లంటే పెద్దగా పడదు నీకు.. ఆఖరికి నాన్నను కూడా దబాయించేస్తావు. నువ్వు తినే చిప్స్ లాక్కుని తింటున్నాడు అనుకుని కళ్లతో ఉరిమి చూశావు కదా.. అప్పుడు అనిపించింది, నీ ముక్కు మీద వచ్చిన ఆ చిన్న కోపం కూడా ఎంత బాగుందో అని.

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

నువ్వు మొండిఘటానివి సీతా.. నీకు నచ్చకపోతే అరుస్తావు, దబాయిస్తావు, అలుగుతావు, మళ్లీ రివర్స్‌లో నీకే సారీ చెప్పమంటావు. నువ్వంటే ఇష్టమని ఎదుటివాళ్లే ముందు చెప్పాలని అనుకుంటావు. ఏది ఏమైనా నువ్వు అంటే పడి చచ్చిపోవాలని పెద్ద బిల్డప్ నీకు.

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

ఆఖరికి చీర కట్టుకున్నా, నిన్ను పొగడాలి. సరే కదా అని కొంచెం రిక్వెస్ట్ చేశామా? ఇక అంతే.. చెట్టెక్కి కూర్చుంటావు. అవును మరి.. అసలే నువ్వు సీతామాలక్ష్మివి కదా. నీ డొక్కు మొహం, నీ చెత్త టీ, నీ సుత్తి ఇన్విటేషన్ నచ్చలేదంటూ లెవల్ చూపిస్తావు. అలా పొగరుగా మాట్లాడినా ముద్దుగానే ఉంటావులే. 

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

నీకు కోపం కూడా కొంచెం ఎక్కువే. నువ్వు కోపంలో కూడా భలే ఉంటావు సీతా.. నీకు డబ్బు మీద ఆశ లేదు. అవసరానికి ఉంటే చాలు అనుకుంటావు. నిజంగా పేరుకు తగ్గట్లు నువ్వు బంగారం సీతా.  ఆడపిల్ల అంటే ఇంటికే పరిమితం కానక్కర్లేదు, తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని నమ్ముతావు. దాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నీ స్టైల్‌లో గట్టిగానే సమాధానం చెప్తావు. అసలు ఎక్కడిది నీకు అంత కాన్ఫిడెన్స్. అదిగో ఆడపిల్ల అంటే అచ్చం అలానే ఉండాలి.. సింపుల్‌గా నీలా ఉండాలి. 

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

నచ్చిన మనిషి దగ్గర ఎంత బెట్టు చేసినా.. లోలోపల తెగ ఆరాటపడిపోయావు. ఇష్టపడినవాడు నిన్ను కాదని వేరేవాళ్లను చేసుకుంటాడని టెన్షన్ పడిపోయావు.. కోపం పెంచేసుకున్నావు. చివరికి నువ్వు గిఫ్ట్‌గా ఇచ్చిన స్కార్ఫ్ కూడా తిరిగి ఇచ్చేయ్ అనేంత మొండితనం ఎందుకు సీతా నీకు. అవునులే.. ఆడపిల్లవి.. ఆ మాత్రం ఆత్మాభిమానం ఉండాలి. నీలాంటి అందమైన రాక్షసిని దక్కించుకోవాలంటే అన్ని కష్టాలు పడాలా..? 

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

అయినా తెగ నచ్చేశావ్.. ఎందుకంటే నీలో ధైర్యం ఉంది, అమాయకత్వం ఉంది, ఆత్మాభిమానం ఉంది, స్వతంత్రంగా బతకాలనుకునే ఆలోచన ఉంది. మొండితనం ఉంది, ప్రేమ ఉంది. ఒక అమ్మాయిలో ఇన్ని క్వాలిటీలు ఉంటాయా అని నిన్ను చూశాకే అర్థమైంది. నీలా అందరూ ఉండలేరు సీతా.. నువ్వు నువ్వే. 

అందమైన 'గోదావరి'లో సీత ప్రయాణం

  'గోదావరి' మూవీలో సీత క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. మీకూ అలా నచ్చిన ఏదైనా హీరోయిన్ క్యారెక్టర్ ఉందా..? అయితే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మీకు ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. 


THANK YOU 

PC: CH. VAMSHI MOHAN




కామెంట్‌లు

  1. సీత గురించి రాయాలి అనుకోవడం... పర్వాలేదు.... సీత గురించి ఇంత గొప్పగా రాయడం.. ఓకె... సీత గురించి ఇంత బాగా చెప్పడం ఓకె ఓకె... మొత్తంగా ఆర్టికల్.. డబుల్ ఓకె.. అయిన రాకేష్ గారు... అందరికీ సీత లాంటి అమ్మాయిలు దొరకరుగా...

    రిప్లయితొలగించండి
  2. అందమైన గోదారిలా ఉంది మీ సీత వర్ణన

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి