Maniratnam

తీసింది తక్కువ సినిమాలే.. అయితే ఏం..? భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే సినిమాలు తీశాడు. ఒక్కో సినిమా తీయడానికి చాలా టైమ్ తీసుకుంటాడేమో! కానీ, టైమ్‌లెస్‌గా నిలిచిపోయేవి తీస్తాడు. స్క్రీన్‌పై కనిపించేది మామూలు సన్నివేశమే కావొచ్చు.. కానీ, అది ఆయన చేతిలో పడిందా.. అద్భుతమైన కళాఖండంగా రూపు దిద్దుకుంటుంది. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురు చూస్తుంటారు. ఆయనే.. ఇండియన్ సినిమా కాన్వాస్‌పై తన మెగాఫోన్‌తో అద్భుతమైన చిత్రాలు గీస్తున్న ఆణిముత్యం.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.

Maniratnam

మణిరత్నం గారు తమిళ దర్శకుడే అయినా.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. చాలా మందికి ఇష్టమైన దర్శకుడు కూడా. చక్కని స్క్రీన్‌ప్లే, నటీనటుల సూపర్బ్ యాక్టింగ్, ఫీల్ గుడ్ స్టోరీ, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టేకింగ్.. ఇవన్నీ మణి సార్ సినిమాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓ కథకి మంచి స్క్రీన్‌ప్లే రాసుకోవడంలో మణిరత్నం గారిని కొట్టేవారే లేరంటారు చాలా మంది. మరి అయన సినిమాలు చూడటానికి ఎందుకు అంత బాగుంటాయో.. ఎందుకు ఆయన డైరెక్షన్, టేకింగ్ అంత స్పెషల్ అనేది.. మణిరత్నం గారి ఫ్యాన్స్ అయితేనే తెలుస్తుంది. మరి మణిరత్నం గారు తెరకెక్కించిన కొన్ని అద్భుతమైన ఆణిముత్యాల గురించి ఇప్పుడు చూద్దాం.

Maniratnam

1. మౌనరాగం

ఒక అమ్మాయి.. తన లవ్.. హఠాత్తుగా లవర్ చనిపోతాడు. ఇంట్లో వాళ్ల బలవంతంతో వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. కానీ మనసులో ఒకరిని పెట్టుకుని ఇప్పుడు వేరే అబ్బాయితో లైఫ్ కంటిన్యూ చేయలేకపోతుంది. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చేశాయిలే అంటారా..! ఇప్పుడు వచ్చాయేమో! కానీ, మణిరత్నం గారు 1986లోనే ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా చేశారు. ఒక అమ్మాయి లైఫ్‌లో ఇద్దరు అబ్బాయిలు.. ఇప్పుడు ఇలాంటి కంటెంట్ పెద్ద మ్యాటర్ కాదు. కానీ అప్పట్లో తీయాలంటే కొంచెం ధైర్యం చేశారనే ఒప్పుకోవాలి.

Maniratnam

2. నాయకుడు

సంపూర్ణ నటుడు కమల్ హాసన్ గారు తన నట విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది ఈ సినిమా నుంచే అనుకోవచ్చు. అప్పటి వరకు మామూలు నటుడిగా ఉన్న కమల్‌ని జాతీయ నటుడిని చేసింది ఈ సినిమానే. నా అనేవాళ్లు లేని ఓ కుర్రాడు.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఫైనల్‌గా ముంబైని శాసించే స్థాయికి ఎదగడమే ఈ కథ. డాన్ కదా అని ఇదేదో కమర్షియల్ యాంగిల్ మాత్రమే ఉంటుంది అనుకోకూడదు.. ఆ పాత్రలో ఉండే ఎమోషనల్ యాంగిల్ కూడా ప్రెజెంట్ చేశారు ఇందులో. వేశ్యవాటికలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి కూతురి దృష్టిలో చెడ్డవాడిగా ముద్ర పడిపోయి ఆ బంధం కోసం మౌనంగా బాధపడే ఎన్నో ఎమోషన్స్ ఈ పాత్రలో కమల్ ద్వారా చూపించారు మణిరత్నం గారు.

Maniratnam

3. గీతాంజలి

మణిరత్నం గారి ఒకే ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది. చేసింది ఒకటే అయినా తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన ప్రేమకథని అందించారు. ప్రేమలో ఉండే ఒక సెన్సిటివ్ యాంగిల్ టచ్ చేశారు ఈ సినిమాలో. చావులో కూడా ప్రేమ ఉంటుందని, అది ఇంత అందంగా ఉంటుందని మణిరత్నం గారు తీసే వరకు మనకు తెలియదు. హీరోకి క్యాన్సర్.. జీవితం మీద పెద్దగా ఆశలు లేవు.. అలా సాగుతున్న హీరో జీవితంలో చిన్న ఆశలా అడుగు పెడుతుంది హీరోయిన్. కానీ, ఆ హీరోయిన్ కూడా ఎక్కువ రోజులు బతకదని తెలుస్తుంది. ఇంకా ఏం ఉందని ఇంత ట్రాజెడీ స్టోరీలో చూడటానికి. కానీ, ప్రేక్షకులు చూశారు.. మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నారు.

Maniratnam

4. అంజలి
ఓ చిన్న పాప క‌థ‌ని సినిమాగా తీసే ధైర్యం ఈ రోజు ఏ డైరెక్టర్‌కి ఉంది చెప్పండి? కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేవు, హీరోయిజం ఎలివేషన్‌ తరహా సన్నివేశాలు లేవు, మాస్‌ పాటలు లేవు.. ఒక చిన్న పాప జీవితంలో ఏం జరిగింది? తను చివరలో ఎందుకు చనిపోతుంది?.. అంతే.. పూర్తిగా హ్యూమన్ ఎమోషన్స్.. ఇంకేమీ ఉండవు. అది లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అంటే. హ్యాట్సాఫ్ యూ సార్...
Maniratnam

5. దళపతి

సూపర్ స్టార్స్ రజనీకాంత్, మమ్ముట్టి గార్లతో మల్టీ స్టారర్ మూవీ అంటే మాటలా..! మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ గురించి ఇందులో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సినిమా చూసిన ప్రతిసారి మనం ఆ ఎమోషనల్ డ్రామాలో ఇన్వాల్వ్ కాకుండా ఉండలేమంటే నమ్మండి. మహాభారతంలో కర్ణుడి పాత్రను బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు మణిరత్నం గారు. మీకు మహాభారతం కొంచెం ఐడియా ఉన్నా చాలు.. ఈ సినిమాలో ప్రతి పాత్రని మీరు కంపేర్ చేసుకుంటారు.

Maniratnam

6. రోజా

తన భర్త ప్రాణాల కోసం యమధర్మరాజు తో పోరాడిన సతీ సావిత్రి కథ మీకు తెలుసా?.. అదే ఈ సినిమా. అలాంటి కథతోనే ఇండియన్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో కథ రాసుకున్నారు మణిరత్నం గారు. తన భర్తని టెర్రరిస్టుల నుంచి కాపాడుకోవడానికి ఒక ఆడది చేసే పోరాటమే ఇది. ఒక సాధారణ పల్లెటూరి నుంచి వచ్చిన ఒక స్త్రీ.. తన భర్తని దక్కించుకోవడానికీ టెర్రరిస్టులకి కూడా భయపడకుండా వాళ్ల కళ్లలోకి సూటిగా చూసి ప్రశ్నించే సన్నివేశాలు ఇందులో అద్భుతంగా ఉంటాయి.

Maniratnam

7. బొంబాయి

నేను చిన్నప్పుడు ఈ సినిమా గురించి విన్నది ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో హిందూ, ముస్లింలకు చాలా గొడవలు అయ్యాయని. మరి అంత వివాదాస్పదంగా ఇందులో ఏముందో తెలుసుకోవడమే ఈ సినిమాపై నాకు ఇంట్రెస్ట్ పుట్టించింది. ఇలాంటి ఒక సినిమా తీసి మెప్పించడానికి నిజంగా ఎంతో ధైర్యం ఉండాలి అనిపించింది. చివరగా.. మంచి స్క్రిప్ట్, ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్, సూపర్బ్ క్లైమాక్స్.

Maniratnam

8. సఖి

ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని మూవీ ఇది. సినిమాలో మాధవన్, షాలినిల లవ్ ట్రాక్ ఎక్స్‌ట్రార్డినరీ. ఒక రెగ్యులర్ లవ్ స్టోరీని ఇంత ఫీల్ గుడ్ మూవీలా డిజైన్ చేయడం మణిరత్నం గారికే సాధ్యం అనుకుంటా. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి మరియు అబ్బాయి.. ప్రేమ.. పెళ్లి.. అందులో ఎదుర్కొనే స్ట్రగుల్స్ అన్నీ చాలా సహజంగా చూపించారు ఈ సినిమాలో.

Maniratnam

9. అమృత

ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక మధుర కావ్యం ఈ సినిమా. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన ఒక పాప.. ఊహ తెలిశాక తను పెంచుకుంటున్న వాళ్లు తన సొంత వాళ్లు కాదని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, తాను ఎలా స్పందిస్తుందో ఏమని చెప్పగలం..! కన్నవాళ్లు ఎవరో తెలియని ఒక పసిపాప ఎమోషన్స్ ఎలా క్యాప్చర్ చేశారో చూడాలంటే ఈ 'అమృత' సినిమా చూడండి.

Maniratnam

10. ఇద్దరు

తమిళనాడు రాష్ట్రంలోని ఇద్దరు గొప్ప వ్యక్తులు MG రామచంద్రన్ మరియు M కరుణానిధి గారి జీవితాల నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యి తీసిన సినిమా ఇది. చరిత్రలో చెప్పుకోదగ్గ ఇద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనలు, భావోద్వేగాలు, బంధాలు, పోరాటాలు.. ఇలా ప్రతి అంశాన్ని తెరపై అద్భుతంగా చూపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద యాక్టర్స్ ఉంటారు. ఒక్కో పాత్రలో ఒక్కొక్కరు జీవించారనే చెప్పాలి ఈ సినిమాలో. సింప్లీ సూపర్బ్.

Maniratnam

11. విలన్

మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది.. కానీ, ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఈ సినిమాని రామాయణం బేస్ చేసుకుని తీశారు మణిరత్నం గారు. సినిమా మొదటి నుంచి ముగింపు వరకు రామాయణంలో జరిగిన ఏదో ఒక సంఘటన మరియు పాత్రలే మీకు గుర్తుకు వస్తాయి ఇది చూస్తే. సినిమా చివరలో.. ప్రతి రావణుడిలో ఒక రాముడు ఉంటాడు, అలాగే ప్రతి రాముడిలో ఒక రావణుడు ఉంటాడని ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించేలా మెసేజ్ ఇచ్చారు.

Maniratnam

12. ఓకే బంగారం

మణిరత్నం గారి సినిమాల్లో 'సఖి' తర్వాత యూత్‌కి కనెక్ట్ అయిన సినిమా ఇదే. సినిమాలో దుల్కర్, నిత్య మాత్రం యాక్టింగ్ ఇరగదీశారు. ఇప్పటి జనరేషన్ ఆలోచనా విధానానికి దగ్గరగా ఉండే రెండు పాత్రలతోనే సినిమా అంతా. లవ్, ఎమోషన్స్, పెళ్లి లాంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వని ఆ ఇద్దరు కొన్ని అనుకోని పరిస్థితుల తర్వాత.. జీవితమంటే ఏంటో తెలుసుకుని చివరికి ఒక్కటవుతారు.

Maniratnam

13. పొన్నియిన్ సెల్వన్

మణిరత్నం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్'. ఎంజీఆర్, కమల్ హాసన్ లాంటి వాళ్లు కూడా ఈ సినిమాని తీయాలని అనుకుని కొన్ని కారణాలతో చేయలేకపోయారట. మొత్తానికి మణిరత్నం గారు తనదైన శైలితో ఎక్స్‌ట్రార్డినరీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాని ప్రేక్షకులకు అందించారు. తమిళులకు ఎంతో ముఖ్యమైన ఇలాంటి చరిత్రని.. అన్ని రకాల ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా తీసి, మణిరత్నం గారు తప్ప ఇంకెవ్వరూ తీయలేరని నిరూపించి మెప్పించారు.

Maniratnam
మీకు మణిరత్నం గారి సినిమాల్లో నచ్చిన సినిమా ఏది? కామెంట్ చేయండి. ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ చేయండి.

Thank You 

కామెంట్‌లు