'బలగం'.. మన ఊరి కథ

బలగం.. ఇది నీ కథ.. నా కథ.. మన కథ. కన్నతల్లి లాంటి పల్లెటూరి కథ. పుట్టి పెరిగిన ఊరి మీద ప్రేమ, అయినవాళ్లతో అనుబంధాలు పెనవేసుకున్న కథ. ఒక చావుతో కూడా ఇన్ని భావోద్వేగాలు ముడిపడి ఉంటాయని గుర్తు చేసిన కథ. మనిషి బతికి ఉన్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా తనతో బంధాలను మోసుకెళ్తాడని నిరూపించిన కథ.'బలగం'.. మన ఊరి కథ సినిమాలో కొమురయ్య అనే పాత్ర మరణించాక ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి.. అప్పుడు చుట్టూ ఉన్నవారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి.. చావు తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని మర్చిపోతున్న మన తరానికి మరోసారి గుర్తు చేశారు. ఒక వైపు చిన్నగా నవ్వులు పూయిస్తూనే.. మరోవైపు, కన్నబిడ్డలు ఇంటి పెద్ద పోయాడని గుండెలు పగిలి ఏడుస్తుంటే చూసే మన హృదయం కన్నీరు కార్చకుండా ఉంటుందా?'బలగం'.. మన ఊరి కథఊళ్లో అందరూ కొమురయ్యను తాత అనో, బావ అనో, అన్న అనో.. పిలుస్తుంటారు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ వరసలతో పిలుచుకుంటూ ఊరంతా ఓ కుటుంబంలా కలిసి ఉంటారని చెప్పారు. ఊళ్లో అందరికి కొమురయ్య ఒక ఆత్మీయుడు. ఇంటి పెద్దలాగా అన్నమాట. అందుకే రక్త సంబంధం ఉన్నా లేకపోయినా కొమురయ్యని తాత అని మన మనిషిలా పిలుచుకుంటారు. ఆ మట్టి వాసన, ఆ బంధాలు చచ్చే వరకు నీతోనే ఉంటాయి.. నీ కట్టె కాలే వరకు ఆ జ్ఞాపకాలు అక్కడే తిరుగుతుంటాయని చూపించారు.'బలగం'.. మన ఊరి కథకొమురయ్య శవం దగ్గర కూతురు, కొడుకులు వచ్చి ఏడుస్తుంటే.. వాళ్లు పిలిచే 'బాపూ' అనే మాటలో ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది, 'తాత' అనే పిలుపులో ఎంత పెద్దరికం దాగి ఉందో అర్థమవుతుంది. అన్న, బావ అని పిలిచే ఊరి జనం గుండెలో కొమురయ్యతో ఉన్న అనుబంధం కనిపిస్తుంది. సినిమాలో కొమురయ్య మొదట్లోనే చనిపోతాడు.. ఆ చావు చుట్టూనే కథ అంతా నడుస్తుంది. కానీ, చూసే మనకు మాత్రం కొమురయ్య తాత సినిమా అంతా ఉన్నాడు అనుకునేలా కనెక్ట్ అయిపోతాం. 'బలగం'.. మన ఊరి కథముఖ్యంగా తండ్రి శవం దగ్గరికి కూతురు వచ్చి దీపంలో వత్తిని సరిచేసినప్పుడు.. చిన్నప్పుడు చెల్లె కనిపించకుండా పోతే అన్న తపన పడ్డాడని గుర్తు చేసినప్పుడు.. 20 ఏళ్లు సొంత ఇంటికి దూరమైన ఓ ఆడబిడ్డ వేదన పడినప్పుడు.. పోయిన తాత తిరిగి రాడని, తాను చూపించే ప్రేమ మళ్లీ దొరకదని మనవడు గ్రహించినప్పుడు.. ఎన్ని గొడవలు జరిగినా కుటుంబం అంతా కలిసే ఉండాలని కథలా చెప్తే అంతా ఒక్క దగ్గర చేరి ఏడ్చినప్పుడు.. ఇలా ఒక్కటేమిటీ..? మనసనేది ఉన్న ప్రతి మనిషి గుండె బరువెక్కి కన్నీరు పెట్టుకునే సందర్భాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయ్.'బలగం'.. మన ఊరి కథఇది అనుబంధాలను తట్టి లేపిన సినిమా.. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఒకే ఇంట్లో ఉండి కూడా మనుషుల్లో మర్చిపోయిన ప్రేమను గుర్తు చేసిన సినిమా.. తండ్రి మన కోసం పడే తపనని, అన్నదమ్ముల మధ్య ఆప్యాయతని, పుట్టింటికి దూరమై తన మనసుని మాత్రం ఇక్కడే విడిచి పెళ్లి పేరుతో అత్తారింటికి వెళ్లిపోయిన ఆడబిడ్డ అనురాగాన్ని గుర్తు చేసిన సినిమా.. చాలా ఏళ్ల తర్వాత ప్రతి ఊళ్లో తెర ఏర్పాటు చేసి చూపిస్తే ఊరంతా కన్నీరు పెట్టిన సినిమా...'బలగం'.. మన ఊరి కథబంధాలు, బంధుత్వాలు, చిర్రుబుర్రులు, అలకలు, కోపాలు ఎన్ని ఉన్నా.. మనిషి పుట్టిన నుంచి చచ్చేవరకు ప్రేమ, ఆప్యాయతలతో ఉండాలని, మన చుట్టూ ఉండేవాళ్లే మనవాళ్లని.. వాళ్లే మనకు కొండంత ధైర్యం ఇచ్చే 'బలగం' అని కళ్లకు కట్టినట్లు తీసిన దర్శకుడు వేణు గారికి నా నమస్కారాలు. కుటుంబాలను ఒక్కటి చేసే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి.. మనం తెలుసుకోవాలి.. మనిషిలా బతకాలి.'బలగం'.. మన ఊరి కథ


THANK YOU 

కామెంట్‌లు